KCR: కేసీఆర్‌కు వరుస ఎదురు దెబ్బలు.. ఏం జరుగుతోంది!

ఈ క్రమంలో కేసీఆర్‌ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రవళిక కేసులో నిందుతుడు అని పోలీసులు, కేటీఆర్‌ చెప్పిన శివరామ్‌ రాథోడ్‌ తాజాగా కోర్టులో లొంగిపోయాడు. శివరామ్‌ కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు కేసు కూడా పెట్టారు.

Written By: Bhaskar, Updated On : October 21, 2023 12:54 pm

KCR

Follow us on

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సర్కార్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇన్నాళ్లూ తమకు తిరుగులేదని భావిస్తున్న గులాబీ బాస్‌.. వరుస ఎదురు దెబ్బలతో ఏం జరుగుతుంది అని ఆందోళన చెందున్నట్లు తెలుస్తోంది. ఇటీవలకే కేటీఆర్‌ ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వీలో ప్రవళిక ఆత్మహత్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యారు. ప్రవళిక అసలు ఏ పరీక్షలు రాయలేదని, విపక్షాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కానీ, ప్రవళిక ఏయే పరీక్షలు రాసిందో మరుసటి రోజు నెటిజన్లు ఆధారాలతో సహా సోషల్‌ మీడియాలో పోస్టు చేసి కేటీఆర్‌ను ట్రోల్‌ చేశారు. దీంతో తేలురుకున్న కేటీఆర్‌.. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రవళిక కుటుంబాన్ని ప్రగతిభవన్‌కు పిలిపించి తన కూతురు ఆత్మహత్యకు ప్రేమే కారణమని ప్రకటన చేయించారు.

లొంగిపోయిన నిందితుడు..
ఈ క్రమంలో కేసీఆర్‌ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రవళిక కేసులో నిందుతుడు అని పోలీసులు, కేటీఆర్‌ చెప్పిన శివరామ్‌ రాథోడ్‌ తాజాగా కోర్టులో లొంగిపోయాడు. శివరామ్‌ కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు కేసు కూడా పెట్టారు. అయితే విపక్షాలు మాత్రం ప్రవళిక ఆత్మహత్యకు ఉద్యోగ పరీక్షలు వాయిదా, జాబ్‌ రాకపోవడమే కారణమని ఆరోపించారు. కానీ కేటీఆర్‌ మాత్రం శివరామే నిందితుడు అంటున్నారు. అయితే ఇక్కడ ప్రవళిక రాసిన సూసైడ్‌ నోట్‌లో ఎక్కడా శివరామ్‌ పేరు ప్రస్తావించలేదు. ఈ క్రమంలో శివరాం శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయి ట్విస్ట్‌ ఇచ్చారు. పోలీసులు అరెస్ట్‌ చేయాల్సి శివరామ్‌.. తనంతట తానే లొంగిపోవడం, విచారణకు సహకరిస్తానని చెప్పడంతో బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్‌.. పోలీసులు కేటీఆర్, కేసీఆర్‌ మాట వినడం లేదని అర్థమవుతోంది.

గుర్తుల పిటిషన్‌ డిస్మిస్‌..
ఇక మరో ఎదురుదెబ్బ ఏంటంటే.. ఎన్నికల సంఘం కేటాయిస్తున్న కారును పోలిన గుర్తులపై బీఆర్‌ఎస్‌ ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ముందుగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. తర్వాత పిటిషన్‌ ఉప సంహరించుకుని సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం బీఆర్‌ఎస్‌ పిటీషన్‌ను కొట్టేసింది. ఎన్నికల్లో ఏగుర్తుకు ఓటు వేయాలో ఓటర్లకు తెలుసని వ్యాఖ్యానించింది. దీంతో బీఆర్‌ఎస్‌ పరువు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కారు గుర్తును పోలిన రోడ్‌ రోలర్, చపాతీ రోలర్‌ లాంటి గుర్తులతో ఇబ్బందులు తప్పవు.

వరుస ఎదురు దెబ్బలతో బీఆర్‌ఎస్‌కు షాక్‌ అవుతోంది. కీలక సమయంలో ఇలాంటి పరిణామాలపై గులాబీ బాస్‌ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మరి ముందు ముందు ఇంకా ఎలాంటి షాక్‌లు తగులుతాయో, వాటిని కేసీఆర్‌ ఎలా అధిగమిస్తారో చూడాలి.