Chandrababu : ఈ మధ్యన చంద్రయాన్ విజయాన్ని చంద్రబాబు ఖాతాలో వేసేశారు టీడీపీ అనుకూల మీడియా. చంద్రయాన్ విజయంతో ఏపీలో కూడా ‘చంద్రయానమే’ అని మన టీవీ5 సాంబశివరావు అయితే ఏకంగా ప్రకటన చేశారు. మొత్తం అందరూ చంద్రబాబులోని ‘చంద్ర’ విజయం అంటూ ఊదరగొట్టారు.
చంద్రయాన్ సక్సెస్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేసింది. అందులో ‘సైకిల్’తో మొదలైన మన అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు చంద్రుడిపై కాలు మోపేదాకా సాగింది అని సైకిల్ పై రాకెట్ బొమ్మను తీసుకెళుతున్న ఫొటోను షేర్ చేసింది. గ్రాఫిక్స్ లో చూపించింది. ఇందులో అర్థం చేసుకోవాల్సింది.. టీడీపీ గుర్తు సైకిల్ ను ప్రమోట్ చేయడం.. ఇందులో చంద్రబాబు పాత్రను నొక్కి చెప్పడం.. ఇప్పుడు అందరూ సైకిల్ కే ఓటు వేయాలన్నది పచ్చ మంద చెప్పే ఉద్దేశం.
ఇక టీవీ5 సాంబశివరావు అయితే చంద్రయాన్ సక్సెస్ తో ఇక ఏపీలో చంద్రమే.. చంద్రోదయమే.. చంద్రబాబుదే అధికారం అని చాటింపు వేశాడు. ఇలాంటివాటిని క్యాష్ చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారు ఉండరంటారు. హైదరాబాద్ కట్టింది నేనే.. సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ చైర్మన్ ను చేసింది నేనే.. అంటూ లేని గొప్పలు అని చెప్పుకునే చంద్రబాబు మాత్రమే కాదు.. ఆయన చుట్టూ ఉన్న మీడియా కూడా ఇదే డబ్బు చాటింపు చేస్తోంది. చంద్రయాన్ విజయాన్ని చంద్రబాబు ఖాతాలో వేయడానికి తాపత్రాయపడింది.
అయితే నెటిజన్లు ఊరుకోరు కదా.. మన చంద్రబాబును ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. చంద్రబాబు గొప్పలకు ఇలా తిప్పలు పెడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో తయారు చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. చంద్రబాబు అమాంతం ఎగిరి రాకెట్ లా చంద్రుడిపైకి పోయినట్టు అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ అయినట్టు.. అక్కడ మీడియాతో మాట్లాడినట్టు సృష్టించారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటాన్ని ఈ ఒక్క వీడియోతో కడిగిపారేశారు. మీరూ చూసి ఈ వీడియోను నవ్వుకోండి.. కంపల్సరీగా నవ్వుతారు. నవ్వకపోతే చంద్రబాబు మీద ఒట్టే మరీ..
https://twitter.com/SumaTiyyaguraa/status/1695819146204991626?s=20