https://oktelugu.com/

Anu Emmanuel: ఆ నిర్మాత కమిట్మెంట్ అడిగాడు… హీరోయిన్ అను ఇమ్మానియేల్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

అనూహ్యంగా అజ్ఞాతవాసి మూవీలో ఛాన్స్ పట్టేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ హైప్ మధ్య విడుదలైన చిత్రంగా అజ్ఞాతవాసి ఉంది. డిజాస్టర్ అయినా కూడా ఓపెనింగ్ వసూళ్లలో రికార్డ్స్ నమోదు చేసింది.

Written By:
  • Shiva
  • , Updated On : August 28, 2023 / 04:57 PM IST

    Anu Emmanuel

    Follow us on

    Anu Emmanuel: ఆ స్టార్స్ తో నటించినా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది అను ఇమ్మానియేల్. ఈ మలయాళ భామ విదేశాల్లో పెరిగింది. నటనపై మక్కువతో ఇండియా వచ్చింది. 2011లో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ మలయాళ చిత్రం చేసింది. తెలుగులో హీరోయిన్ గా ఆమె మొదటి చిత్రం మజ్ను. నాని హీరోగా చేశారు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే తర్వాత ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. గోపీచంద్ తో ఆక్సిజన్ టైటిల్ తో మూవీ చేసింది. ఇది ఆడలేదు.

    అనూహ్యంగా అజ్ఞాతవాసి మూవీలో ఛాన్స్ పట్టేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ హైప్ మధ్య విడుదలైన చిత్రంగా అజ్ఞాతవాసి ఉంది. డిజాస్టర్ అయినా కూడా ఓపెనింగ్ వసూళ్లలో రికార్డ్స్ నమోదు చేసింది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అను ఇమ్మానియేల్ తో పాటు కీర్తి సురేష్ మరొక హీరోయిన్. అనిరుధ్ తొలిసారి తెలుగు సినిమాకు మ్యూజిక్ అందించారు. అనంతరం అల్లు అర్జున్ కి జంటగా నాపేరు సూర్య చిత్రం చేసింది. ఇది మరో డిజాస్టర్.

    దాంతో స్టార్స్ ఆమెను పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుతం అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. అను ఇమ్మానియేల్ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర ఇది కూడా ఆడలేదు. నెక్స్ట్ ఆమె జపాన్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. కార్తీ హీరోగా తెరకెక్కిన జపాన్ తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల అవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న అను ఇమ్మానియేల్ క్యాస్టింగ్ కౌచ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

    అను ఇమ్మానియల్ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నారు. తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని వెల్లడించారు. ఓ నిర్మాత నన్ను ఆఫర్ కోసం అడ్జస్ట్ అవుతావా అన్నాడు. కమిట్మెంట్ అడిగాడు. క్యాస్టింగ్ కౌచ్ పరిశ్రమలో ఉంది. ఈ పరిస్థితులను మనం కుటుంబం సహాయంతో ఎదుర్కోవాలి. వాళ్ళకు చెప్పి ఫ్యామిలీ అండగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఒత్తిడికి గురి కాకుండా ఉంటామని ఆమె చెప్పుకొచ్చారు. మోడరన్ డేస్ లో చాలా మంది హీరోయిన్స్ దీనిపై గళం విప్పారు. తాజాగా అను ఇమ్మానియేల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.