TV journalism Viral video: మన దేశంలో అతిపెద్ద ధనవంతుడైన ముఖేష్ అంబానికి news 18 పేరుతో అతిపెద్ద నెట్వర్క్ ఛానల్ గ్రూప్ ఉంది. ఈ news18 హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వార్తలు ప్రసారం చేస్తుంది. ఇక మిగతా భాషాల్లో వెబ్ జర్నలిజం ద్వారా వార్తలను పబ్లిష్ చేస్తుంది. అంబానీ డప్పు కొట్టగా.. మిగతా స్పేస్ లో ఏవేవో వార్తలు ప్రసారం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ ఉన్న ఛానల్ గా news18 కొనసాగుతోంది. వాస్తవానికి ఈ టి ఆర్ పి రేటింగ్ కేటాయింపు అనేదే పెద్ద దందా. రిపబ్లిక్ టీవీ విషయంలో ఏం జరిగిందో గతంలోనే మనం చెప్పుకున్నాం. ఇక ఈ news18 రిపోర్టర్ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఓ ఆర్మీ ఎన్కౌంటర్ రిపోర్ట్ చేసేందుకు వెళ్లడం.. అక్కడ నానా హంగామా చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ఇదే సమయంలో నెటిజన్లు ఆ ఛానల్ రిపోర్టర్ పై మండిపడుతున్నారు. “ముకేశ్ అంబానీ ఛానల్ కాబట్టి ఎక్కడికైనా వెళ్తారా. అదేమైనా నార్మల్ వెహికల్ అనుకుంటున్నారా. ఒక స్త్రీ అయి ఉండి అలా చేయడం కరెక్టేనా” అంటూ ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న వీడియో ప్రకారం.. జమ్ము కాశ్మీర్లో ఇటీవల ఆర్మీ ఎన్కౌంటర్ చేసింది. దానిని రిపోర్ట్ చేసేందుకు news 18 ఛానల్ కు చెందిన ఓ మహిళా రిపోర్టర్ వెళ్ళింది. అక్కడ జరిగిన దృశ్యాలను లైవ్ లో అందించే ప్రయత్నం చేసింది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆమె తన రిపోర్టింగ్ లో భాగంగా పట్నీ టాప్(జవాన్లు ప్రయాణించే వాహనం) ఎక్కింది. జవాన్లు తమ ఆపరేషన్ లో భాగంగా వెళ్తున్నప్పటికీ ఆ వాహనంలో అలానే కూర్చుంది. తన మానానా తను చెప్పుకుంటూ వెళ్తోంది. అంతేతప్ప కనీసం అక్కడ ఏం జరుగుతోంది? ఎలాంటి పరిస్థితి ఉంది? అలాంటి పరిస్థితుల్లో రికార్డింగ్ చేయడం కరెక్టేనా? అనే విషయాలను పూర్తిగా మర్చిపోయింది. రిపోర్టింగ్ పేరుతో సున్నితమైన విషయాలను పక్కనపెట్టింది.
ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం కావడంతో ఆ రిపోర్టర్ పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.. ఒక పాత్రికేయురాలి కి ఆర్మీ జవాన్లపై పట్టింపు లేదా అని ప్రశ్నిస్తున్నారు..” అమ్మా తల్లీ.. అది నీ న్యూస్ ఛానల్ ఓబీ వెహికల్ కాదు. టూరిస్ట్ వాహనం అంతకన్నా కాదు. అది సున్నితమైన ప్రాంతం. సైనికులు అత్యంత పకడ్బందీగా ఆపరేషన్ నిర్వహిస్తున్న ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్లి అలాంటి రిపోర్టింగ్ చేయడం నీలాంటి వాళ్లకే చెల్లింది. వార్తలు సేకరించే క్రమంలో పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులు పడిన విధానం మేము చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ నువ్వు వార్తలకు బదులు సెన్సేషన్ క్రియేట్ చేయడంలో ముందు వరుసలో ఉన్నావ్. ఇలాంటి దుస్థితి పాత్రికేయానికి పట్టినందుకు చింతిస్తున్నామని” నెటిజన్లు వాపోతున్నారు.. ఇదే సమయంలో news 18 ఛానల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. అయితే పాత్రికేయురాలిపై రక్షణ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఆర్మీ జవాన్లు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
A reporter who reached Patnitop in Jammu Kashmir during an encounter faced firing
"She is the CM" #justice_for_pooja #PAKvBAN #RanbirKapoor
pic.twitter.com/9aGEuvCTvL— Neha Sharma (@Nehas_01) August 16, 2024