Indra Movie : టాలీవుడ్ లో మళ్ళీ రీ రిలీజ్ ట్రెండ్ ఊపు అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9 వ తారీఖున విడుదలైన ‘మురారి’ చిత్రం ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన అన్నీ సినిమాల రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఈ చిత్రం 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుంది. ఇప్పుడు ఈ రికార్డు ని ఎవరు బద్దలు కొట్టబోతున్నారు అనే దానిపై పెద్ద చర్చ సాగుతుంది. ఆగష్టు 22 వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వైజయంతి మూవీస్ సంస్థ ‘ఇంద్ర’ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసి చాలా రోజులైంది.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని కాసేపటి క్రితమే బుక్ మై షో యాప్ లో ప్రారంభించారు. కేవలం ఆరు షోస్ కి సంబంధించిన బుకింగ్స్ మాత్రం ప్రారంభించగా, వాటికి అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. బుకింగ్స్ మొదలుపెట్టిన 5 నిమిషాల్లోనే 7 లక్షల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే వైజాగ్ లో అప్పుడే ఒక షో హౌస్ ఫుల్ కి దగ్గరగా ఉంది. ఇది ఒక ఆల్ టైం రికార్డు గా చెప్పుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇంద్ర చిత్రం చిరంజీవి కెరీర్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి ఈ సినిమా దాదాపుగా 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అంతే కాదు 50 రోజుల సెంటర్స్, వంద రోజుల సెంటర్స్, 175 రోజుల సెంటర్స్ లలో అత్యధిక కేంద్రాలలో ప్రదర్శితమైన చిత్రంగా ఇంద్ర సరికొత్త చరిత్ర సృష్టించింది. అలాగే ఈ చిత్రాన్ని రీసెంట్ గానే పలు మార్లు జీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ చెయ్యగా, రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి చేసిన అన్నీ సినిమాలకంటే అత్యధిక రేటింగ్స్ ఈ చిత్రానికి వచ్చాయి.
జనాల్లో అంతటి క్రేజ్ ఉన్న సినిమా కాబట్టే ఈ సినిమా రీ రిలీజ్ లో గ్రాండ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రారంభం లోనే ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ అంటే, ఇక పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయితే ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ చిత్రం మహేష్ బాబు మురారి రీ రిలీజ్ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి. అయితే ఈ సినిమాకి ప్రొడక్షన్ టీం అనుకున్న స్థాయిలో ప్రొమోషన్స్ చెయ్యకపోవడం పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి సత్తా ఉన్న సినిమాని వృధా చేస్తున్నారు అంటూ వైజయంతి మూవీస్ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు.