Homeఆంధ్రప్రదేశ్‌Kuppam YCP: మందుపోస్తూ చిందేయరా.. ఇలా అయితే వై నాట్ కుప్పం ఎలా?

Kuppam YCP: మందుపోస్తూ చిందేయరా.. ఇలా అయితే వై నాట్ కుప్పం ఎలా?

Kuppam YCP: వై నాట్ 175 అన్న నినాదంతో వైసిపి ముందుకు సాగుతోంది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. పంచాయితీ ఎన్నికలతో పాటు మునిసిపల్ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం లో వైసీపీ స్వీప్ చేసింది. అప్పటినుంచి వైసీపీలో మరింత ధీమా పెరిగింది. ఎమ్మెల్సీ భరత్ ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తోంది. ఆయనకు ఫుల్ పవర్ ఇచ్చింది. అప్పటినుంచి భరత్ దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గతంలో చంద్రబాబును అడ్డుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి.

ప్రస్తుతం చంద్రబాబు అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే ఆదునుగా భావిస్తున్న వైసిపి కుప్పం పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని ప్రయత్నాలు ప్రారంభించింది. చంద్రబాబు అవినీతిపరుడని చూపే ప్రయత్నం చేస్తోంది. ఇంటింటికి వెళ్లి ఇదే ప్రచారం చేస్తోంది. అయితే ప్రజల నుంచి అనుకున్నంత స్పందన రావడం లేదు. వైసిపి ఆశించిన స్థాయిలో ప్రజలు స్పందించడం లేదు. అయినా సరే వైసిపి నాయకత్వం వెనక్కి తగ్గడం లేదు. నియోజకవర్గంలో సభలు సమావేశాల పేరిట సందడి చేస్తోంది.

అయితే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో… ఇటీవల ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ శ్రేణులు హాజరయ్యాయి. అయితే జన సమీకరణకు, ఏర్పాట్లకు భారీగా మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. సమావేశ అనంతరం సభా ప్రాంగణంలోనే మందు పంపిణీ చేయడం విశేషం. దాదాపు మూడు నాలుగు చోట్ల వందలాది మందికి బహిరంగంగానే మద్యం పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. నెటిజెన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

కుప్పంలో గెలుపొందుతామన్న వైసిపి ఇటువంటి చర్యలకు పాల్పడుతుండడం మాత్రం మైనస్ గా మారుతుంది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన.. చంద్రబాబును ఓడిస్తామని భీష్మించుకోవడం అతి అనిపిస్తోంది. ఈ క్రమంలో ఒక వ్యూహం ప్రకారం వెళ్లాల్సింది పోయి.. ఇలా బహిరంగంగానే మద్యం సరఫరా చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదేనా? మద్య నిషేధం అంటూ నెటిజన్లు సీఎం జగన్ ను ప్రశ్నిస్తున్నారు. పిల్ల సైకోలతో ఇలా చేయిస్తారా? ఇదేనా మీరు అమలు చేస్తున్న మద్యనిషేధం జగన్ అంటూ టిడిపి శ్రేణులు నిలదీస్తున్నాయి. ప్రస్తుతం కుప్పం వైసీపీ మీటింగ్లో మందుబాబుల ఆగడాల వీడియోలే మీడియాని షేక్ చేస్తున్నాయి.

వైసీపీ మీటింగ్ లో మందేస్తూ చిందేయరా.! #kuppam #ysrcp #Reddeppa #shorts #youtubeshorts

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version