Leo Review: తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా లియో… ఈ సినిమా తెలుగు తమిళం లో ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది.అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఇక చాలా రోజుల నుంచి తెలుగులో ఒక సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కి ఈ సినిమా తో అతను అనుకున్న విజయం దక్కిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా లియో సినిమా స్టోరీ లోకి వెళితే పార్తిబన్ (విజయ్) అనే ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్ లో ఒక కేఫ్ పెట్టుకొని బతుకుతూ ఉంటాడు.ఒక రోజు తన కేఫ్ లో జరిగిన ఒక సంఘటన వల్ల ఆయన జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. అసలు ఆ సంఘటన ఏంటి ఎందుకు ఆయన లైఫ్ చాలా మలుపులు తిరిగింది అనే విషయాలను తెలుసుకోవాలంటే మాత్రం మీరు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే…
ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాతో లోకేష్ కనకరాజ్ మరొకసారి తన డైరెక్షన్ తాలుకు ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించాడు. దాంతో ఈసారి కూడా తన డైరెక్షన్ స్టామినాని తెలుగు, తమిళ్ ప్రేక్షకులకి చూపించాడు. ఈ సినిమాలో ప్రతి సీను కూడా తనదైన మార్క్ లో ఒక డిఫరెంట్ వే లో తీసే ప్రయత్నం చేశాడు.ఇక కొన్ని యాక్షన్ బ్లాక్ లు అయితే తనే దగ్గరుండి మరి యాక్షన్ కొరియోగ్రఫీ చేయించుకున్నాడు అంటే సినిమా మీద తనకి ఉన్న ఇంట్రెస్ట్ ని మనం అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ సీక్వెన్స్ మొత్తం కూడా థియేటర్ లో బ్లాస్ట్ అయ్యాయనే అనే చెప్పాలి.ఇక థియేటర్ లో సినిమాని చూసే ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అలాగే సినిమా నార్మల్ గా స్టార్ట్ అయినప్పటికీ ఒక 30 మినిట్స్ తర్వాత మాత్రం సినిమా దూసుకుపోతూ ఉంటుంది.ఇక ఇంటర్వెల్ కి వచ్చేసరికి డైరెక్టర్ మనల్ని ఒక హై లోకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు.ఇక ఇంటర్వెల్ తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది.ఇక అక్కడి నుంచి సినిమా ఇంకో రేంజ్ లో నడుస్తూ ఉంటుంది.
ఇక ఈ సినిమాలో విజయ్ మంచి పర్ఫామెన్స్ ని అందించారు. ముఖ్యంగా ఆయన కెరీర్ లో ది బెస్ట్ పర్ఫామెన్స్ ని ఇచ్చాడనే చెప్పాలి.ఇక ప్రతి ఫ్రేమ్ లో కూడా విజయ్ తన క్యారెక్టర్ తాలూకు డెప్త్ ని పొట్రే చేస్తూ విజయ్ కాకుండా ఆ క్యారెక్టర్ లో మాత్రమే కనిపించే విధంగా ప్రతి ప్రేక్షకుడిని ఆ మూడు లోకి తీసుకెళ్ళాడు.ఇక అలాగే సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, త్రిష లాంటి వాళ్లు కూడా వాళ్ల క్యారెక్టర్ల పరిధి మేరకు చాలా బాగా నటించారు.ఇక మనోజ్ పరమహంస తన విజువల్స్ తో సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాడు ఇక అనిరుధ్ మ్యూజిక్ లోని సాంగ్స్ అంత బాగాలేనప్పటికి బిజీయం మాత్రం బాగా ఇచ్చాడు దాని వల్లే సినిమాలో కొన్ని సీన్లు ఎలివేట్ అయ్యాయి…
ఇక ఈ సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే విజయ్ యాక్టింగ్,లోకేష్ కనక రాజ్ డైరెక్షన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, అనిరుద్ధ్ బ్యా గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. వీళ్ళందరి కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది…
సినిమా లో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమా స్టోరీ రొటీన్ గా ఉండటం, ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసిన స్టోరీ కావడం,ఇక అలాగే కొన్ని అనవసరమైన సీన్లని సినిమాతో సంబంధం లేకుండా మధ్యలో ఇరికించడం జరిగింది. అది కూడా సినిమాకి బాగా మైనస్ అయింది.ఇక ఈ మ్యూజిక్ మాత్రం అనురుధ్ రేంజ్ లో లేకపోవడం…ఇక ఇలాంటి మైనస్ లు ఉన్నప్పటికీ సినిమా ఎక్కడ కూడా సగటు ప్రేక్షకుడి కి బోర్ కొట్టించకుండా సాగుతుంది…
ఇక ఈ సినిమా కి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5