Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో తొలి వారం నామినేషన్స్ లో మొదలైంది ఈ రచ్చ. అమర్ దీప్, ప్రశాంత్ ని తక్కువ చేసి మాట్లాడి,అవమానించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అమ్మ,అక్క,ఆలీ అంటూ బూతులు తిడుతున్నారు. దీనిపై అమర్ తల్లి ఆవేదన చెందుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. తన కోడలిని,కొడుకు ని తిట్టిన వారిని ఆమె కూడా బూతులు తిట్టింది.
దీనిపై స్పందిస్తూ జానకి కలగనలేదు సీరియల్ నటుడు నరేష్ తన ఇన్ స్టా ద్వారా ఒక వీడియో షేర్ చేశాడు. ‘దయ చేసి ఇంట్లో వాళ్ళని తిట్టొద్దు అని దండం పెట్టి మరీ చెప్పాడు. అమర్ కి సపోర్ట్ చేసినందుకు తనని ఏ విధంగా బూతులు తిట్టారో చెప్పుకొచ్చాడు. అమర్ తల్లి బాధ పడిన విషయం గురించి ప్రస్తావించాడు.మీకు ఇదేం పోయే కాలం రా ఒక అమ్మ నోటి నుంచి వినకూడని మాటలు వినిపించేలా చేశారు .. ఆవిడ మనసు ఎంత బాధ పడి ఉంటే ఆలా మాట్లాడతారు అని బాధ పడ్డారు నరేష్.
ఇక ఆ తర్వాత అమర్ సపోర్ట్ చేసినందుకు నేను నచ్చక ఒకడు మెసేజ్ చేశాడు. ‘నీ అమ్మ డాష్ అని పెట్టాడు. నేను వాడితో ఓపికగా మాట్లాడాను. ‘బ్రో నేను నీకు నచ్చలేదు డైరెక్ట్ గా నన్ను తిట్టొచ్చు కదా మధ్యలో అమ్మని,అక్క ,ఆలిని ఎందుకు తిడుతున్నారు. మీ ఇంట్లో అమ్మ,అక్క,ఆలి ఎవరు లేరా అని అన్నాను. దానికి వాడు సారీ చెప్పి మెసేజ్ లు డిలీట్ చేశాడు.ఇలా ఎంతమందికి చెప్పగలను. నిజంగా మీకు తిట్టాలి అనిపిస్తే డైరెక్ట్ గా తిట్టండి.
అమ్మని,అక్కని ,ఆలిని తిట్టొద్దు.దయ చేసి అర్ధం చేసుకోండి. ఆడవాళ్ళని తిడితే మీకు ఏమీ రాదు. మీరు దీన్ని కూడా ట్రోల్ చేస్తారని తెలుసు.. దయ చేసి ఇంట్లో వాళ్ళని తిట్టొద్దు అని వేడుకున్నారు నరేష్. మరోవైపు ఈ వారం అమర్ దీప్, ప్రశాంత్, తేజా, గౌతమ్, పూజా, భోలే, అశ్విని నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.