Rain Recedes: తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దాదాపు వారంరోజుల పాటు ఎడతెరపి లేకుండా చేయడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణ శాఖ అప్రమత్తమైంది. రెడ్, ఆరెంజ్ అలర్టులు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. దీంతో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలారు. కడెం ప్రాజెక్టు తెగుతుందనే ఉద్దేశంతో దాదాపు 12 గ్రామాలను ఖాళీ చేయించారు. కానీ తెగలేదు. ప్రమాదం తప్పింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాజెక్టుల్లోకి ఇన్ ఫ్లో పెరడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కల్పించాయి.

మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ ఇచ్చిన నివేదికతో మరో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో విద్యార్థులందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒడిశా కేంద్రంగా అల్పపీడనం బలహీనపడటంతో వర్షాలు లేవని తెలిపింది. దీంతో ప్రజలకు ఉపశమనం కలిగినట్లు అయింది. ఇన్నాళ్లు వర్షాలు కురవడంతో ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితి. ఇప్పుడు నిన్నటి నుంచి విరామం ప్రకటించడంతో రైతులు తమ పనుల్లో తలమునకలయ్యారు.
Also Read: Athma Sakshi Survey: ఆత్మసాక్షి సర్వే: తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో తీవ్ర నష్టం ఏర్పడింది. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనం ఎటు వెళ్లలేని దుస్థితి. కానీ వాతావరణం ప్రస్తుతం ప్రశాంతంగా ఉండటంతో ఇక పనులు విస్తృతంగా చేసుకోవాలని భావిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లోనే ఉంటూ కలుపు పనులు చేస్తున్నారు. ఈ విరామం ఇంకో రెండు మూడు రోజులు ఉంటే పనులు కొంచెం చక్కబడతాయని చెబుతున్నారు. కానీ వరుణుడు ఏం చేస్తాడో తెలియడం లేదు.

ఒడిశా తీరంలో ఏర్పడాల్సిన అల్పపీడనం బలహీన పడింది. దీంతో భారీ వర్షాలు కురవకుండా చేసింది. దీంతో ప్రజలకు ఊరట లభిస్తోంది. ఇన్నాళ్లు వానలతో ఇబ్బందులు పడ్డ జనానికి తీపి కబురు అందించినట్లు అయింది. ఈ క్రమంలో భారీ వర్షాల ముప్పు తప్పింది. జనజీవనం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. తమ పనులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అల్పపీడనం బలహీన పడటంతో ఇక పనులు ముమ్మరంగా చేసుకోవాలని భావిస్తున్నారు. పంట చేలను కలుపు తీసుకునే పనుల్లో పడ్డారు.