Olympic medals : ప్యారిస్‌లో 2024లో ఒలింపిక్స్ జరిగాయి. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మెడల్స్(Medals) గెలుచుకున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడలుగా ఒలింపిక్స్‌కు గుర్తింపు ఉంది. ఈ పోటీలు నాలుగున్నర ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొనే క్రీడాకారులు ప్రపంచం నలుమూలల నుండి తమ దేశాలను ప్రతినిధించడానికి వచ్చి, వివిధ క్రీడా విభాగాలలో పోటీపడతారు. విజేతలకు ఒలింపిక్ అసోసియేషన్ మూడు రకాల బహుమతులు ప్రదానం చేస్తుంది. మొదటి స్థానం పొందిన క్రీడాకారులకు స్వర్ణ పతకం(Gold Medal) ఇస్తారు. ఈ మెడల్ అత్యంత విలువైనది మరియు ప్రదర్శనలో అత్యుత్తమమైనది. రెండో స్థానం పొందిన క్రీడాకారులకు రజత పతకం(Silver Medal) ఇస్తారు. మూడో స్థానం సాధించిన క్రీడాకారులకు కాంస్య పతకం(Brange Medal)ఇస్తారు. ఈ పతకాలు దేశాల క్రీడా ప్రాధాన్యతను తెలియజేస్తాయి. అయితే 2024 విశ్వ క్రీడలు ముగిసి ఏడాది కాకుండానే చాలా వరకు పతకాలపై ఉన్న లోహపు పూత చెదిరిపోయింది. పతకాల్లో లోపాలను గమనించిన క్రీడాకారులు వాటిని వాపస్ ఇస్తున్నారు. ఇప్పటికే వంద మంది తమ పతకాలను వాపస్ చేశారు.
స్పందించిన ఐఓసీ..
పతకాలు వాపస్ ఇస్తుండడంపై అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ స్పందించింది. లోపభూయిష్టంగా ఉన్న 2024 ఒలింపిక్స్ పతకాలను మార్చి కొత్తవి ఇస్తామని తెలిపింది. 2024 ఒలింపిక్ గేమ్స్ నిర్వాహక కమిటీ ఫ్రెంచ్ ప్రభుత్వ మింట్‌తో కలిసి పనిచేస్తుందని. ఆ సంస్థే పతయాలు తయారు చేసిందని తెలిపింది. నాణ్యత బాధ్యత కూడా వహిస్తుందని పేర్కొంది. మెడల్స్‌పై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి లోపభూయిష్టంగా ఉన్న వాటిని ఫ్రెంచ్‌ప్రభుత్వం(Fernch governament) రీప్లేస్ చేస్తుందని వివరించింది. ఈ ప్రక్రియ వారం రోజుల్లో ప్రారంభం అవుతుందని వెల్లడించింది. ఫ్రెంచ్ ప్రభుత్వం మాత్రం పతకాల నాణ్యతపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టింది. గత ఆగస్టు నుంచే లోపాలు ఉన్న పతకాలు మార్చి ఇచ్చామని పేర్కొంది. ఇప్పటి వరకు వంద పతకాలు పతకాలు మార్చి ఇచ్చినట్లు తెలిపింది.
అమెరికా అథ్లెట్ ఫిర్యాదు..
ఇక అమెరికాకు చెందిన అథ్లెట్ స్కేట్ బోర్డర్ హుస్టన్ అయితే పతకాల నాణ్యతపై ఫిర్యాదు చేశారు. ఈ ఒలింపిక్స్‌లో 5,084 పతకాలు అథ్లెట్లకు ప్రదానం చేశారు. వీటిని విలాసవంతమైన నగలు తయారు చేసే చైమెట్ సంస్థ డిజైన్ చేసింది. ఒలింపిక్స్ విజేతకు బంగారు పతకం ఇస్తారు. అయితే దీనిని పూర్తిగా బంగారంతో చేయరు. వెండితో తయారు చేసి పైన బంగారు పూత పూస్తారు. స్వర్ణ పతకంలో 92.5 శాతం వెండి ఉంటుంది. బంగారం కేవలం 6 గ్రాములే ఉంటుంది. గతేడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో విజేతలకు ప్రదానం చేసపిన స్వర్ణ పతకం విలువ రూ.62 వేల నుంచి రూ.71 వేల వరకు ఉంది. ఇక రజత పతకానికి పూర్తిగా వెండిని మాత్రమే వాడతారు. దీని విలువ సుమారు రూ.37 వేలు పలుకుతుంది. కాంస్య పతకంలో 95 శాతం రాగి ఉంటుంది. 5 శాతం జింక్ కలుపుతారు. దీని విలువ కేవలం రూ.500 మాత్రమే. పారిస్ ఒలింపిక్స్(Parise Olimpics) సందర్భంగా తయారు చేసి పతకాల్లో ఈఫిల్ టవర్ నుంచి తీసిన ఇనుమును కూఆ కలిపారు. ఖర్చుతో సంబంధం లేకుండా ఒలింపిక్స్ పతకాలను చాలా విలువైనవిగా క్రీడాకారులు భావిస్తారు.