https://oktelugu.com/

చంద్రబాబుకు మరో షాక్.. టీడీపీకి మాజీ మంత్రి గుడ్ బై

టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించాడు. ఒకానొక సందర్భంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందా అనే ప్రశ్న అందరిలోనూ వచ్చింది. అన్ని విధాలా జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూశాడు. ఇప్పుడు ఇక జగన్‌ వంతు వచ్చినట్లైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమిని చవిచూసింది. కనీసం ప్రతిపక్షం పాత్ర కూడా పోషించలేని స్థాయికి దిగజారింది. సీఎం జగన్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ లాంటివేవీ చేపట్టకుండానే టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2020 / 04:22 PM IST
    Follow us on

    టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించాడు. ఒకానొక సందర్భంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందా అనే ప్రశ్న అందరిలోనూ వచ్చింది. అన్ని విధాలా జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూశాడు. ఇప్పుడు ఇక జగన్‌ వంతు వచ్చినట్లైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమిని చవిచూసింది. కనీసం ప్రతిపక్షం పాత్ర కూడా పోషించలేని స్థాయికి దిగజారింది. సీఎం జగన్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ లాంటివేవీ చేపట్టకుండానే టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు వలసలు వస్తున్నారు.ఇప్పటికే ఎమ్మెల్యేలుకు జారీ పోగా తాజాగా మాజీ మంత్రి కూడా టీడీపీకి రాజీనామా చేసి చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చాడు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి తన భార్యతో కలిసి టీడీపీకి రాజీనామా చేశారు. 1982 నుంచి పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రి తాళ్లపాక రమేశ్ రెడ్డి టీడీపీ ఆవిర్భావం నుంచి దివంగత ఎన్టీఆర్ కుటుంబంతో అనుబంధం ఉంది. ఎమ్మెల్యేగా రమేశ్ రెడ్డి, రాష్ట్రమంత్రిగా రమేశ్ రెడ్డి భార్య అనురాధ నెల్లూరు మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేశారు.

    Also Read: హవ్వా.. బాబు నియోజకవర్గానికి జగన్‌ నీళ్లివ్వాలంట

    ఇటీవల చంద్రబాబు వేసిన రాష్ట్ర కమిటీలు ఆ పార్టీలు చిచ్చుపెట్టారు. రమేశ్ రెడ్డికి చంద్రబాబు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో.. ఒక్కమాట కూడా చెప్పకుండా పార్టీ పదవి నుంచి తప్పించడంపై ఆయన రగిలిపోయారు. రాష్ట్ర కమిటీ ప్రకటన తర్వాత ఏపీ టీడీపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

    Also Read: తమిళ కలువ ‘కమల’.. అమెరికా ఉపాధ్యక్షురాలు ఎలా అయ్యింది?

    నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి తాళ్లపాక రమేశ్ రెడ్డి, ఆయన భార్య అనురాధ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు. గతంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా అనురాధ ఉన్నారు. పార్టీ ఏర్పాటు, ఆ తర్వాత కూడా పార్టీలో కొనసాగుతున్నామని.. తనను పదవి నుంచి తప్పించే సమయంలోనూ కనీసం మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్టు వారు తెలిపారు. వీరిద్దరూ త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉంది.