https://oktelugu.com/

బిగ్ బాస్-4: పట్టుకోసం ‘బిగ్ బాస్’తండ్లాట..! వైల్డ్ కార్డ్ గా సుమ

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ కొనసాగుతోంది. బిగ్ బాస్ 1..2..3లతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్-4తో మాత్రం నిరాశ పరుస్తుండటంతో ఆ స్థానానికి ఎసరు వచ్చేలా కన్పిస్తోంది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు షోపై అంచనాలు పెంచేందుకు రకరకాల టాస్కులు పెడుతూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ బిగ్ బాస్-4లోని కంటెస్టుల్లో సెలబ్రెటీలు పెద్దగా లేకపోవడం మైనస్ గా మారింది. బిగ్ బాస్-4 […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2020 / 05:04 PM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ కొనసాగుతోంది. బిగ్ బాస్ 1..2..3లతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్-4తో మాత్రం నిరాశ పరుస్తుండటంతో ఆ స్థానానికి ఎసరు వచ్చేలా కన్పిస్తోంది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు షోపై అంచనాలు పెంచేందుకు రకరకాల టాస్కులు పెడుతూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    బిగ్ బాస్-4లోని కంటెస్టుల్లో సెలబ్రెటీలు పెద్దగా లేకపోవడం మైనస్ గా మారింది. బిగ్ బాస్-4 షో ప్రారంభం రోజున అదిరిపోయే టీఆర్పీ తెచ్చుకుంది. అయితే క్రమంగా టీఆర్పీ పడిపోతుండటంతో బిగ్ బాస్ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఈక్రమంలోనే పలువురిని వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు.

    Also Read: అల్లరి నరేశ్ గురించి ఆసక్తికర విషయాలివీ

    బిగ్ బాసులోని కంటెస్టెంట్లంతా ఏకమై వైల్డ్ కార్డు ఎంట్రీలుగా వచ్చేవారిని టార్గెట్ చేయడంతో బిగ్ బాస్ ప్లాన్ బెడిసి కొట్టింది. దీంతో పలురకాల టాస్కుతో బిగ్ బాస్ షోను రక్తికట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా బిగ్ బాస్ హౌసులోకి మల్టి టాలెంటెడ్ యాంకర్ సుమను వైల్డ్ కార్డు ద్వారా పంపుతున్నారనే టాక్ విన్పిస్తోంది.

    Also Read: విక్రమ్ టైలర్ టాక్: విరుచుకుపడిన కమల్ హాసన్..!

    వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పటికే పూర్తవగా టీఆర్పీ డౌన్ అవుతుండటంతో సుమను బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నట్లు తెలుస్తోంది. అయితే యాంకర్ సుమ బుల్లితెరపై అనే కార్యక్రమాలు యాంకరింగ్ చేస్తూ ఫుల్ బీజీగా ఉంది. స్టార్ మహిళ.. క్యాష్ తదితర కార్యక్రమాలతోపాటు స్వంత యూట్యూబ్ చానెల్.. ఓటీటీ కార్యక్రమాలు చేస్తోంది. దీంతో ఆమె ఒక వారం లేదా రెండు వారాలకు మించి బిగ్ బాస్ హౌసులో ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.