Pawan Kalyan -Prabhas: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ ఊపు ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మొదటి విడత గా ఉభయ గోదావరి జిల్లాలలో ఆయన యాత్ర ప్రారంభించాడు. కత్తి పూడి సభతో ప్రారంభమైన ఈ యాత్ర నిన్న నర్సాపురం తో సభతో ముగిసింది. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ భీమవరం కి చేరుకున్నాడు.
ఇక్కడ ఎలాంటి సభ లేదు కానీ, రెండు రోజులపాటు ఆయన ఇక్కడ స్థానిక నాయకులతో మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అవ్వబోతున్నాడు. మలివిడత ‘వారాహి విజయ యాత్ర’ వచ్చే నెల 11 వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాలో సాగనుంది.ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ నిన్న నర్సాపురం సభలో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అందులో ముఖ్యంగా ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు హైలైట్ అయ్యాయి.
ముందుగా ప్రభాస్ అభిమానులు కొంతమంది జనసేన పార్టీకి సపోర్టుగా బ్యానర్స్ పట్టుకొని పవన్ కళ్యాణ్ కి కనిపిస్తారు. అది గమనించిన పవన్ కళ్యాణ్ ‘ఇక్కడికి వచ్చిన ప్రభాస్ అభిమానులందరికీ ధన్యవాదాలు.ఇప్పుడు ప్రభాస్ బాహుబలి మరియు ఆదిపురుష్ సినిమాలు చేసాడు. వాటి ఫలితాలు ఎలా ఉన్నా ఆయన వల్ల రోజుకి వెయ్యి నుండి రెండు వేల మందికి పని దొరుకుతుంది. అలా ఆయన సినిమా చెయ్యడం వల్ల వచ్చే డబ్బులతో టాక్సులు కడుతాడు,ఆయన సినిమా విడుదల అయితే ఎంతో మంది చిరు వ్యాపారులకు లాభాలు వస్తాయి, ఎన్నో జీవితాలు ఆయనని నమ్ముకొని బ్రతుకుతాయి. మరి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రికి అంత డబ్బు, అంత ఆస్తి ఎలా వచ్చింది. ఆయనేమైనా ప్రభాస్ లాగ సినిమాలు చేశాడా?, తండ్రి ముఖ్యమంత్రి అనే సాకుని అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేసి సంపాదించిన సొమ్ము అదంతా’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.