https://oktelugu.com/

వైసీపీ ఎంపీ రఘురామ అసమ్మతి వెనుక అంతపెద్ద కథా?

ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిదంటే ఇదే మరీ.. కొద్దిరోజులుగా వైసీపీలో అసమ్మతి గళం వినిపిస్తున్న వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు ముదిరిపాకాన పడింది. ఆయన తాను వైఎస్ జగన్ బొమ్మ మీద గెలవలేదని అనడం..దానికి నర్సాపురం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలంతా భగ్గుమని నియోజకవర్గంలో రఘురామను కాలు కూడా పెట్టనీయమని హెచ్చరించడంతో ఈ వివాదం ముదిరింది. వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల వార్నింగ్ తో రఘురామకృష్ణం రాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో తనకు ప్రాణహాని ఉందని.. కేంద్ర […]

Written By:
  • NARESH
  • , Updated On : June 22, 2020 1:06 pm
    Follow us on

    raghurama-krishnam-raju-ysrcp-mp
    ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిదంటే ఇదే మరీ.. కొద్దిరోజులుగా వైసీపీలో అసమ్మతి గళం వినిపిస్తున్న వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు ముదిరిపాకాన పడింది. ఆయన తాను వైఎస్ జగన్ బొమ్మ మీద గెలవలేదని అనడం..దానికి నర్సాపురం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలంతా భగ్గుమని నియోజకవర్గంలో రఘురామను కాలు కూడా పెట్టనీయమని హెచ్చరించడంతో ఈ వివాదం ముదిరింది.
    వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల వార్నింగ్ తో రఘురామకృష్ణం రాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో తనకు ప్రాణహాని ఉందని.. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు రక్షణ కల్పించాలని ఏకంగా తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం సంచలమైంది. అంతటితో ఊరుకోకుండా వైసీపీకి కోపం తెప్పించేలా తన పీఏతో కలిసి పశ్చిమ గోదావరి ఎస్పీకి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఫిర్యాదు కూడా చేయించాడు.
    ఇక తాజాగా స్పీకర్ రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ కు ఆగ్రహం కలిగేలా పలు సీరియస్ ఆరోపణలు కూడా చేశాడు. ఆ లేఖలో వైసీపీ ఎంపీ రఘురామ పలు సంచలన ఆరోపణలు చేశారు. ‘ తిరుమల శ్రీవారి భూముల అమ్మకం అంశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలవడానికి ప్రయత్నించానని అప్పటి నుంచి తన నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నారని ’  ఆరోపించారు.  ఇక ఏపీ ప్రభుత్వ ఇసుక వ్యవహారంలో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపానని సామాన్యులకు న్యాయం చేయాలని కోరితే వైసీపీ ఎమ్మెల్యేలతో విమర్శలు చేయిస్తున్నారని వైసీపీ ఎంపీ తెలిపారు. నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని బెదిరిస్తున్నారన్నారు.  స్థానిక పోలీసులకు తన వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని లేఖలో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
    అయితే వైసీపీ నుంచి గెంటేయాలనే రఘురామ ఇదంతా చేస్తున్నాడని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీలో చేరేందుకే వైసీపీ ఎంపీ నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారని.. వైసీపీపై ఆరోపణలు చేస్తున్నాడని అంటున్నారు. దీనిపై అసలు కథ ఏంటని ఆరాతీయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయట..
    2010లో ఈస్ట్ కోస్ట్ పవర్ అనే విద్యుత్ ఉత్పత్తి సంస్థ రఘురామకృష్ణ రాజుకు  ఉండేదట.. దీని మీద ఇప్పటికే ఆయన 947 కోట్ల రూపాయలను బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. కానీ తీర్చలేకపోయాడు. దాని మీద రఘురామపై న్యూఢిల్లీలోని ఎకనామిక్ ఆఫీస్ వింగ్ లో కేసు నమోదైందట.. ఈ కేసు విచారణ రావడంతో వైసీపీలో ఉంటే ఇక లాభం లేదని.. బీజేపీలో చేరి ఆ కేసులు విచారణకు రాకుండా మాఫీ చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు ఇదంతా చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
    ఈ విద్యుత్ ఉత్పత్తి సంస్థ నుంచి అధిక ధరకు యూనిట్ కు విద్యుత్ కొనడానికి సీఎం వైఎస్ జగన్ అంగీకరించకపోవడంతో ఆయనపై రఘురామ కోపం పెంచుకున్నాడట…మరోవైపు అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఎలాగైనా కేసు నుంచి తప్పించుకునేందుకు బీజేపీలో చేరికనే బెస్ట్ ఐడియా అని వైసీపీ నుంచి వెలివేయించుకోవడానికి ఇంతగా తాపత్రాయపడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
    అయితే విషయం తెలిసిన సీఎం జగన్.. రఘురామను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా.. అలాగే నియోజకవర్గంలో తిరగనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడట.. మరోవైపు బీజేపీ కూడా రఘురామను తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదట.. ఇలా వైసీపీలో ఉండలేక.. బీజేపీలో చేరలేక తరుముకొస్తున్న కేసును ఎలా ఎదుర్కోలేక వైసీపీ ఎంపీ రఘురామ కిందామీదపడుతున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది..