Homeజాతీయ వార్తలుPregnant Woman Yoga Video Viral: 9 నెలల గర్భంతో శీర్షాసనం.. గర్భిణి యోగా వీడియో...

Pregnant Woman Yoga Video Viral: 9 నెలల గర్భంతో శీర్షాసనం.. గర్భిణి యోగా వీడియో వైరల్‌!

Pregnant Woman Yoga Video Viral: యోగా భారతీయ వ్యాయం.. దీర్ఘ కాలిక రోగాలను నయం చేసే శక్తి యోగాకు ఉంది. అందుకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన యోగాను ఓ 9 నెలల గిర్భణి వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిండు గర్భంతో యోగా ఆసనాలు వేసే వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గర్భంతో చక్రాసనం, శీర్షాసనం వంటి అత్యంత క్లిష్టమైన యోగా ఆసనాలను సులభంగా చేస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆమె శరీర సమతుల్యత, బలం నైపుణ్యం చూసి చాలా మంది ‘‘అద్భుతం’’, ‘‘ప్రేరణ’’ అని ప్రశంసిస్తున్నారు.

ఇంతకీ ఎవరా మహిళ?
వీడియోలో కనిపిస్తున్న ఆ గర్భిణి ఒక ప్రొఫెషనల్‌ యోగా ట్రైనర్‌. గర్భధారణకు ముందు నుంచి సుదీర్ఘకాలం యోగా అభ్యాసం చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భిణి అయినా కొన్ని అడ్వాన్స్‌డ్‌ ఆసనాలను కొనసాగించగలిగింది. అయితే ఇది సాధారణ గర్భిణులందరికీ సాధ్యం కాదు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రమాదకరమంటున్న వైద్యులు..
గర్భధారణ సమయంలో శరీరంలో రిలాక్సిన్‌ అనే హార్మోన్‌ పెరిగి కీళ్లు, స్నాయువులు మెత్తబడతాయి. దీంతో బ్యాలెన్స్‌ తగ్గి పడిపోయే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా 8వ, 9వ నెలల్లో శీర్షాసనం, చక్రాసనం వంటి ఇన్వర్షన్‌ (తలక్రిందులు) ఆసనాలు చేయడం వల్ల రక్తపోటు మార్పులు, గర్భాశయంపై అనవసరపు ఒత్తిడి పెరుగుతాయి. బ్యాలెన్స్‌ కోల్పోయి పడడం జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల సూచనలు అవసరం…
నిపుణుల పర్యవేక్షణ లేకుండా, ముందస్తు సుదీర్ఘ శిక్షణ లేకుండా గర్భిణులు ఇలాంటి అడ్వాన్స్‌డ్‌ యోగా ఆసనాలు చేయకూడదు. ఈ వీడియో గర్భిణీలు శారీరక దృఢతను కాపాడుకోవాలనే సందేశం ఇస్తోంది. యోగా గర్భధారణలో స్ట్రెస్‌ తగ్గడం, శ్వాస నియంత్రణ, శరీర సౌకర్యం కోసం చాలా మంచిది. కానీ అది ప్రెగ్నెన్సీ సేఫ్‌ యోగా మాత్రమే కావాలి. ప్రొఫెషనల్‌ యోగా ట్రైనర్‌ అయినందున ఆమెకు ఇది సాధ్యమైంది. కానీ సాధారణ మహిళలు ఇలాంటి వీడియోలను చూసి స్వయంగా ప్రయత్నించడం ప్రమాదకరం.

గర్భిణులు యోగా చేయాలి.. కానీ సరైన గురువు మార్గదర్శకత్వంలో, డాక్టర్‌ సలహాతో, తమ శరీర స్థితిని బట్టి మాత్రమే. అద్భుతాలు ప్రేరణ ఇవ్వాలి, ప్రమాదాలు కాకూడదు. యోగా కోసం డాక్టర్‌ లేదా సర్టిఫైడ్‌ ప్రీనాటల్‌ యోగా ఇన్‌స్ట్రక్టర్‌ సలహా తీసుకోవాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular