ఉద్ధవ్‌ థాక్రే ఎమ్యెల్సీగా ఎన్నికకు మార్గం సుగమం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే శాసన మండలికి ఎన్నిక కావడంపై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. ఎట్టకేలకు ఆయన ఎన్నిక కావడానికి మార్గం సుగమమైనది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన మహారాష్ట్ర శాసనమండలిలో 9 స్థానాలకు జరుగవలసిన ఎన్నికలను ఈ నెల 21న జరపడానికి కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీచేయడంతో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడే ప్రమాదం తప్పింది. మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం ఏ సభలో సభ్యుడు కానీ ఉద్ధవ్‌ […]

Written By: Neelambaram, Updated On : May 1, 2020 3:33 pm
Follow us on


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే శాసన మండలికి ఎన్నిక కావడంపై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. ఎట్టకేలకు ఆయన ఎన్నిక కావడానికి మార్గం సుగమమైనది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన మహారాష్ట్ర శాసనమండలిలో 9 స్థానాలకు జరుగవలసిన ఎన్నికలను ఈ నెల 21న జరపడానికి కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీచేయడంతో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడే ప్రమాదం తప్పింది.

మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం

ఏ సభలో సభ్యుడు కానీ ఉద్ధవ్‌ థాక్రే నవంబర్ 28న ముఖ్యమంతిగా ప్రమాణస్వీకారం చేయడంతో, ఆరు నెలలలోగా ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావలసి వచ్చింది. మండలి ఎన్నికలు వాయిదా పడడంతో గవర్నర్ కోటా నుండి నామినేషన్ చేయవలసిన రెండు స్థానాలలో ఒక దానిలో ముఖ్యమంత్రిని నామినేట్ చేయమని సిఫార్స్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఏప్రిల్ 9న మొదటిసారి తీర్మానం పంపింది.

రేషన్, లాక్ డౌన్ డబ్బులపై కీలక నిర్ణయం!

దానిపై భగత్ సింగ్ కోషియారి స్పందించక పోవడంతో అదే విషయమై రెండో సారి కూడా మంత్రివర్గం తీర్మానం చేసింది. మొత్తం మంత్రివర్గం వెళ్లి ఆయనను కలిసింది. న్యాయసలహా తీసుకొంటున్నట్లు ఆయన చెప్పారు. మే 27 లోగా మండలికి ఎన్నిక కాలేని పక్షంలో ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, ఈ విషయంలో జోక్యం చేసుకోమని కోరారు. ఆ తర్వాత రెండు, మూడు రోజులకే గవర్నర్ ఈ రోజు ఉదయం స్పందించారు. ఉద్ధవ్‌ థాక్రేను మండలికి నామినేట్ చేసే విషయం తేల్చకపోయినప్పటికీ, రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన 9 స్థానాలకు ఎన్నికలు జరిపామని సిఫార్స్ చేస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ వ్రాసారు.

ఆ వెంటనే ఎన్నికల కమీషన్ స్పందిస్తూ ఎన్నికల పక్రియను ప్రకటించింది. అయితే, ఈ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా బారిన పడకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. అంద‌రూ ముఖాల‌కు మాస్కులు ధ‌రించి, సామాజిక దూరం పాటిస్తూ పోలింగ్‌లో పాల్గొనాల‌ని ఈసీ పేర్కొంది.