Earthquake: ద్వీపాల సముదాయమైన ఇండోనేషియా దేశంలో మరోసారి భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఆసియా దేశంగా పిలువబడే ఇండోనేషియాలో భారీ భూకంపం రావడంతో సునామీ రావొచ్చని ఆ దేశ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండో-పసిఫిక్ మహాసముద్రాలు కలిసే చోట భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్లు కలుస్తాయి. ఈ ప్రాంతం ఇండోనేషియాలో ఉంది. ఇక్కడ తరచూ భూకంపాలు సంభవించడం కామన్.. గతంలో కూడా ఈ ప్రాంతంలో పలుమార్లు భూ కంపాలు సంభవించాయి. భూ కంపాల తీవ్రతను బట్టి ఇండోనేషియాలో సునామీలు వస్తుంటాయి. అయితే, ఇండోనేషియాలో సంభవించిన తాజా భూకంపం తీవ్రత ఎక్కువగా ఉందని ఆ దేశం ప్రకటనతో భారత్ సైతం అప్రమత్తం అయ్యింది.

ద్వీపాల సముదాయంగా పిలువబడే ఇండోనేషియా పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. భూతల స్వర్గంగా ఇండోనేషియాను పిలుచుకుంటారు. కొన్ని దీవులను కలిపి ఇండోనేషియా దేశంగా ఆవిర్భవించింది. అయితే, ఫ్లోరెస్ దీవులకు సమీపంగా మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం 11.20 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించిందని అధికారులు తెలిపారు. ఫ్లోరెస్ ద్వీపంలోని అతిపెద్ద పట్టణం మౌమెరే తీరానికి ఉత్తరంగా 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని ప్రభుత్వం గుర్తించారు. సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం రాగా, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 7.7గా గుర్తించారు. ఇది తీవ్రమైన భూకంపంగా అధికారులు పేర్కొన్నారు. సునామీ రావొచ్చని ముందుగానే హెచ్చరికలు జారీచేశారు.
ఇండోనేషియా మరియు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థలు భూకంప స్థాయి తీవ్రతను నిర్దారించాయి. 7.7 తీవ్రత గల వలన సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం ఫ్లోరెస్ దీవులతో ఇండోనేషియా కూడా వణుకుతోంది. అయితే, ఇండోనేషియాలో సునామీ వస్తే అది ఇండియాను కూడా తాకొచ్చు.
Also Read: మోడీ చెప్పిన సీక్రెట్ : కాశీ నుంచి.. చీరకట్టుకొని పారిపోయిన బ్రిటీష్ గవర్నర్!!
ఇండోనేషియా కేంద్రంగా గతంలో 2004లో సునామీ వచ్చిన విషయం తెలిసిందే. ఆనాడు తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ సునామీ వచ్చింది.భూకంప తీవ్రత 9.1తో తలెత్తిన సునామీ ఆనాడు శ్రీలంక, ఇండియా, థాయిలాండ్‌తో పాటు తొమ్మిది దేశాలను ప్రభావితం చేసింది. ఆ విషాదకరమైన ఘటనలో కనీసం 2,27,898 మంది చనిపోయినట్టు ఆయా దేశాలు ప్రకటించాయి. మరి తాజా సునామీ హెచ్చరిక వలన ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: Russia-Ukraine war: మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా, ఉక్రెయిన్లు ఆజ్యం పోస్తున్నాయా..?