Kondaplli, Rape: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ర్టంలో లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు మహిళలపై జరుగుతున్న దాడులు ఇప్పుడు బాలురపై కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ బాలుడిపై లైంగిక దాడి (Rape) జరగడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. బాలికలు, మహిళలు కాదని ప్రస్తుతం బాలురకు కూడా రక్షణ లేకుండా పోతోందని విచారం వ్యక్తం చేస్తున్నారు. నాగరిక సమాజంలో అనారిక చర్యల పట్ల ఆగ్రహాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు లైంగికదాడులపై విమర్శలు చేస్తున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొండపల్లిలోని (Kondapalli) శాంతినగర్ లో ఓ ఆరేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఉండే ఆరేళ్ల బాలుడు ఆధివారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటుండగా చాక్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తానని ఆశ చూపి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం అతడిపై లైంగికదాడికి తెగబడ్డాడు. దీంతో బాలుడు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులకు విషయం తెలిసింది.
ఈ నేపథ్యంలో వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. దీంతో బాధిత కుటుంబాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు పరామర్శించి ఓదార్చారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఘటన జరిగి 24 గంటల తరువాత కూడా పోలీసులు ఎందుకు కేసు నమోదు ఉమామహేశ్వర్ రావు ప్రశ్ణించారు.
బాలుడిపై లైంగిక దాడి జరిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలు, బాలురు, యువతులు, మహిళలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. కామపిశాచాలు రెచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అత్యాచారాల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని సూచించారు.