Nepal Earthquake: నేపాల్ లో భూకంపం సంభవించింది. దీనివల్ల ఢిల్లీలో భారీ ప్రకంపనలు వచ్చాయి.. మంగళవారం అర్ధరాత్రి దాటాక 1. 57 గంటలకు భూమి కంపించింది.. రిక్టర్ స్కేలు పై 6.3 తీవ్రతగా నమోదయింది. దీంతో ఢిల్లీలోని నోయిడా, గుర్ గావ్ ప్రాంతంలో 10 సెకండ్ల పాటు ప్రకంపనాలు నమోదయ్యాయి.. ఘటనతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళనతో ఇళ్ల నుంచి రోడ్లపై చేరుకున్నారు.. 10 కిలోమీటర్ల భూకంప కేంద్రం ఉన్నట్టు జాతీయ సిస్మోలజీ కేంద్రం ప్రకటించింది. నేపాల్ లో గత ఐదు గంటల్లో భూమి రెండు సార్లు కంపించింది.. భూ ప్రకంపనలు జరిగిన అర్థగంటలోపే ఈ అంశం ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

దాదాపు 20 వేలమంది ట్వీట్లు చేశారు. భూకంప తీవ్రతకు నేపాల్ లోని ధోతి జిల్లాలో ఆరుగురు కన్నుమూశారు. అర్ధరాత్రి పూట భూకంపం సంభవించడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నష్టం కూడా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్ హిమాలయ సానువుల్లోని పర్వత ప్రాంతంలో ఉంటుంది.. ఇక్కడ గతంలో కూడా భూకంపాలు ఏర్పడ్డాయి. నవంబర్ 8వ తేదీన చిలిలోని బూయిన్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద 5.0 గా నమోదయింది. నవంబరు 7న తజకిస్తాన్ దేశం లో కూర్గ్ అనే ప్రాంతంలో 65 కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత 5.4 గా నమోదయింది. నవంబర్ ఆరో తేదీన ఉత్తర సులా వేసి ప్రావిన్స్, ఇండోనేషియా మధ్య 119 కిలోమీటర్ల విస్తీర్ణంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6 గా నమోదయింది. నుకు అలోఫా, టోన్గా ప్రాంతంలో నవంబర్ 5వ తేదీన భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.3 గా నమోదు అయింది. మెక్సికో హెర్మోసిల్లో, సొనేరా ప్రాంతంలో నవంబర్ 4వ తేదీన భూమి కంపించింది. 165 కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనాలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్ పై 6.1 శాతంగా నమోదైంది. అకాజుట్ల, ఎల్ సాల్వడార్ నుంచి 53 కి.మీ మధ్యలో నవంబర్ 4వ తేదీన భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.7 గా నమోదైంది. గ్రీన్ లాండ్ నుంచి క్వాకోర్ టాక్ మధ్య భూమి కంపించింది.. రిక్టర్ స్కేల్ పై 5.4 గా నమొదయింది. నవంబర్ 4న ఈ ఘటన జరిగింది. నవంబర్ 4వ తేదీన తువాల్ సిటీ నుంచి మాలుకు ప్రావిన్స్ వరకు 269 కిలోమీటర్ల పరిధిలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 5.3 గా ప్రకంపనాల తీవ్రత నమోదయింది. అన్నట్టు ఇది ఇండోనేషియా పరిధిలోకి వస్తుంది. రొమేనియా లో నవంబర్ మూడున భూకంపం వచ్చింది. ఇది రిటర్న్స్ స్కేల్ పై 5.1గా నమోదయింది.
భూకంపాలు ఎందుకు వస్తాయి అంటే
భూమి ఉపరితలంపై ఉండే క్రస్ట్ లో ఉండే టెక్టానిక్ ప్లేట్స్ లో అకస్మాత్తుగా కదలిక వచ్చినప్పుడు భారీ స్థాయిలో శక్తి వస్తుంది.. ఆసక్తి తరంగాల రూపంలో భూమి మీదకు చేరుకొని భూమి కంపిస్తే విడుదల అయ్యే శక్తి ఆధారంగా భూకంపం తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఇక పెద్దపెద్ద రిజర్వాయర్లలో నిల్వ ఉంచిన నీటి వల్ల, అపారమైన భూగర్భ జలాన్ని ఎక్కువ దుర్వినియోగం చేయడం ద్వారా, చెట్లను విపరీతంగా నరకడం వల్ల భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రిజర్వాయర్లలో ఉన్న వందలాది ఘనపు మహిళ నీటి ఒత్తిడి భూమిపై పడటం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుని చుట్టూ తిరుగుతున్న క్రమంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరిగేందుకు కారణమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. భూ ప్రకంపనల తీవ్రతను బట్టి నష్టం ఉంటుందని చెబుతున్నారు. భూమి లోపల అనేక పొరలు ఉంటాయి. ఒక పొర మందం 50 కిలోమీటర్లు ఉంటే దానిని క్రేస్ట్ లేదా లితో స్పీయర్ అంటారు. దాని కింది పొరను మాంటక్ అంటారు. దాని మందం మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది. ఈ పొరతో పోలిస్తే హిమాలయ పర్వతాలు చాలా చిన్నవి. భూమిలోని కేంద్ర ప్రాంతాలలో ఉష్ణోగ్రత 8,000 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. ఆ ప్రాంతంలో మరిగిన లావా మాంటెక్, క్రెస్ట్ లను చేయించుకుని బయటకు వస్తుంది. దీనినే అగ్నిపర్వతం బద్దలైందని అంటారు.

12 పొరలు
భూమి లోపల 12 కఠినమైన పొరలతో పాటు చిన్న చిన్న పొరలు కూడా ఉంటాయి.. అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయి.. ఈ కదలిక కారణంగానే అనేక నష్టాలు వాటిల్లుతాయి. ఇక అధిక ఒత్తిడితో బయటకు వచ్చిన లావా ప్రభావంతో భూమి పై పొరైన క్రెస్ట్ 10 నుంచి 12 వరకు చలించే శిలాఫలకాలుగా ఏర్పడుతుంది. లావా ఒత్తిడి, ఉష్ణోగ్రతలకు ఈ శిలాఫలకాలలోని కొన్ని భాగాలలో కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడటం వల్ల ఒకదానికి ఒకటి నెట్టుకుంటాయి. దానివల్ల ఆ శిలాఫలకాలలో పగుళ్ళు ఏర్పడి భూకంపాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. ఇక భూ ప్రకంపనలు వచ్చిన సమయంలో దానిని నమోదు చేసే సాధనాన్ని సిస్మోగ్రాఫ్ అంటారు. రెండవ శతాబ్దంలో చైనాలో మొట్టమొదటిసారిగా సిస్మోగ్రాఫ్ ను తయారు చేశారు. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు జపాన్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్ ద్వారా కొలుస్తారు. దీనిని 1935లో కనుగొన్నారు. 3,800 లీటర్ల పెట్రోలు ఇచ్చే శక్తికి సమానమైన శక్తి భూకంపం సందర్భంగా విడుదలవుతుంది.