Homeఅంతర్జాతీయంUS Iran tensions 2026: ఇరాన్‌పై విరుచుకుపడబోతున్న అమెరికా.. మధ్యప్రాచ్యం టెన్షన్‌

US Iran tensions 2026: ఇరాన్‌పై విరుచుకుపడబోతున్న అమెరికా.. మధ్యప్రాచ్యం టెన్షన్‌

US Iran tensions 2026: అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌.. వెనెజువెలా విజయం తర్వాత గ్రీన్‌లాండ్‌ ఆక్రమణకు యత్నించారు. యురోపియన్‌ యూనియన్‌ నుంచి వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి తోక ముడిచాడు. ఇప్పుడు తన ఫోకస్‌ ఇరాన్‌పై పెట్టాడు. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అక్కడి ప్రజల నిరసనలను ఆసరాగా చేసుకుని ఇరాన్‌పై దాడికి సమాయత్తమవుతున్నాడు. ఏ క్షణంలో అయినా ఇరాన్‌పై విరుచుకు పడేందుకు బలగాలను మోహరించాడు. అణు కార్యక్రమాలు ఆపాలనే లక్ష్యంతో ఈ దాడులకు సిద్ధమవుతునర్నాడు? […]

US Iran tensions 2026: అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌.. వెనెజువెలా విజయం తర్వాత గ్రీన్‌లాండ్‌ ఆక్రమణకు యత్నించారు. యురోపియన్‌ యూనియన్‌ నుంచి వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి తోక ముడిచాడు. ఇప్పుడు తన ఫోకస్‌ ఇరాన్‌పై పెట్టాడు. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అక్కడి ప్రజల నిరసనలను ఆసరాగా చేసుకుని ఇరాన్‌పై దాడికి సమాయత్తమవుతున్నాడు. ఏ క్షణంలో అయినా ఇరాన్‌పై విరుచుకు పడేందుకు బలగాలను మోహరించాడు. అణు కార్యక్రమాలు ఆపాలనే లక్ష్యంతో ఈ దాడులకు సిద్ధమవుతునర్నాడు? ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధ నౌకల తరలింపు మధ్య ప్రాచ్యంలో టెన్షన్‌ పెంచుతోంది.

ఇరాన్‌ సమీపంలో అమెరికా నౌకాదళం
ప్రపంచంలోనే అతిపెద్ద విమానవాహక నౌక యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌. ఫోర్డ్‌ను కేరిబియన్‌ నుంచి అమెరికా మధ్యప్రాచ్యానికి పంపుతోంది. యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ ఇప్పటికే అరేబియా సముద్రంలో ఉంది. వెనెజువెలాలో మదూరో అరెస్ట్‌కు చేపట్టిన ఆపరేషన్‌లో ఈ నౌక పాల్పంచుకుంది.

ఇరాన్‌ అణు వివాదం
అమెరికా ఇరాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉన్నాయని ఆరోపిస్తోంది. తక్షణ నిలిపివేయాలని, ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. ఇరాన్‌ ఖండించినా ట్రంప్‌ నమ్మడం లేదు. దీంతో దాడితోనే ఇరాన్‌ను దారికి తెచ్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు అరబ్‌ దేశాలు యుద్ధ దాడి భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో సంక్షోభం తలెత్తితే చర్చలకు అడ్డంకి కలుగుతుంది.

చర్చలతోపాటు సైనిక బలప్రదర్శన ఇరాన్‌ను ఒత్తిడి చేస్తూ బెదిరింపు పెంచుతోంది. ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని పరీక్షిస్తుంది. యుద్ధం జరిగితే ఆర్థికం, ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమవుతాయి. చర్చలే పరిష్కార మార్గం అని నిపుణులు అంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper