Homeజాతీయ వార్తలు5 State Assembly Election Results: మోడీకి ఆ ఇద్ద‌రు సీఎంల‌ నుంచి పోటీ త‌ప్ప‌దా.....

5 State Assembly Election Results: మోడీకి ఆ ఇద్ద‌రు సీఎంల‌ నుంచి పోటీ త‌ప్ప‌దా.. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలే ఇందుకు నిద‌ర్శ‌నం

5 State Assembly Election Results: దేశ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చేశాయి. అయితే వీటిని మొదటి నుంచి అందరూ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించారు. ఇక యూపీలో గెలిస్తే ఎక్కువ అనుకున్న బీజేపీకి అనూహ్యంగా నాలుగు రాష్ట్రాల్లో అధికారం దక్కింది. పంజాబ్ లో తొలిసారి ఆప్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. దీంతో బీజేపీ సంబరాలు చేసుకుంటుంటే.. మోడీలో మాత్రం ఒకింత టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది.

5 State Assembly Election Results
PM Modi

ఎందుకంటే ఇన్ని రోజులు జాతీయ రాజకీయాల్లో మోడీ దరిదాపుల్లో కూడా జనాకర్షణ కలిగిన నేతలుగా ఎవరూ కనిపించలేదు. కానీ ఇప్పుడు యూపీలో బీజేపీ గెలవడంతో యోగి ఆదిత్యనాథ్ పేరు మార్మోగిపోతోంది. దీంతో ఇప్పుడు బీజేపీలో మోడీకి యోగి పోటీగా తయారయ్యారు. రెండోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో యోగి వ్యూహాలు బలంగా పని చేశాయి. మోడీ మాటల కన్నా యోగి ఆదిత్యనాథ్ అంతర్గత వ్యవహారాలు పార్టీకి భారీ మెజార్టీని తీసుకువచ్చాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

యోగితో పాటు మరో సీఎం కూడా ఇప్పుడు మోడీకి పోటీ గా తయారయ్యారు. ఆయనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. గతంలో మూడుసార్లు ఢిల్లీలో బీజేపీని ఓడించి దేశవ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించారు. కాగా ఇప్పుడు పంజాబ్ లో కూడా అధికారం దక్కించుకోవడంతో ఆయన బలమైన జాతీయ నేతగా మారిపోయారు. పంజాబ్ లో భగవంత మాన్ ను గెలిపించడంలో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు. దీంతో ఆయన పేరు మళ్లీ మార్మోగిపోతోంది.

ఈ ఫలితాలు చూస్తుంటే కేజ్రీవాల్ మోడీకి పోటీగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు మోడీని వ్యతిరేకిస్తున్న మమత, కేసీఆర్ లు కేవలం వారి రాష్ట్రాలకే పరిమితమయ్యారు. కానీ కేజ్రీవాల్ మొదటి సారి మరో రాష్ట్రంలో అధికారం సాధించడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే కేజ్రీవాల్ బెస్ట్ సీఎం అని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు మరో రాష్ట్రంలో కూడా ఆయన పాలన భేష్ అని పేరు వచ్చింది అంటే.. అది రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఆయనకు పాజిటివ్ వేవ్స్ తీసుకొస్తుంది.

yogi kejriwal
yogi kejriwal

ఇలా ఎటు చూసుకున్నా సొంత పార్టీలో యోగి, ప్రత్యర్థి పార్టీల్లో కేజ్రీవాల్ మోడీ కి సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే యోగిని యూపీ వరకే పరిమితం చేయాలనే ప్లాన్ లో మోడీ అమిత్ షా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు కేజ్రీవాల్ ను కూడా కట్టడి చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారంట. కానీ వారిని అదుపు చేయడం అంటే అంత ఈజీ కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇద్దరి నుంచి ప్ర‌ధాని కుర్చీ వైపు ఎవరో ఒకరు దూసుకు వచ్చే ప్రమాదం ఉంది. మరి ఆ ఇద్దరిని ఎదుర్కొనేందుకు మోడీ అమిత్ షా లో ఎలాంటి ప్లాన్ వేస్తారు వేచి చూడాలి.

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] UP Election 2022 Result: బీజేపీ, ఎంఐఎమ్‌.. ఈ రెండు పార్టీల గురించి అంద‌రికీ తెలిసింది ఒక్క‌టే. రెండూ బ‌ద్ధ శ‌త్రువులు గా మెలుగుతాయి. ఒక పార్టీని ఓడించ‌డానికి మ‌రో పార్టీ ఎత్తుగ‌డ‌లు వేస్తుంది. కానీ ఈ రెండు పార్టీల మ‌ధ్య ఉన్న అస‌లు వ్య‌వ‌హారం వేరే ఉంద‌ని మ‌రోసారి బ‌య‌ట‌ప‌డిందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. మొద‌టి నుంచి ఈ రెండు పార్టీల న‌డుమ ఓ టాక్ ఉంది. ఒక పార్టీని గెలిపించ‌డానికి మ‌రో పార్టీ అక్క‌డ కావాల‌నే పోటీ చేస్తుంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. […]

Comments are closed.

Exit mobile version