OKTelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ‘బంగార్రాజు’ మూవీతో మంచి హిట్ కొట్టిన ‘కింగ్’ నాగార్జున. ప్రస్తుతం ‘దీ గోస్ట్’ మూవీ షూటింగ్ నేపథ్యంలో విదేశాల్లో సందడి చేస్తున్నాడు. చిత్రబృందం తాజాగా అప్‌డేట్ ఇచ్చింది. ‘ది గోస్ట్’ మూవీ షూటింగ్ దుబాయ్‌లో జరుగుతున్నట్లు వెల్లడించింది. వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది. అక్కడ హీరోయిన్ సోనాల్ చౌహన్, నాగార్జునలకు సంబంధించిన ఓ సాంగ్, యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్ర బృందం ప్లాన్ చేసిందట.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. హీరో సూర్య ఇంటి ముందు పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా సూర్య నటించిన ‘ఎదుర్కుమ్ తునిందవన్’ మూవీపై పీఎంకే పార్టీ నాయకులు, వన్నియర్ సంఘంకు చెందిన వారు వ్యతిరేకిస్తున్నారు. దీంతో సూర్య ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలోనూ సూర్య నటించిన జై భీమ్ సినిమా వివాదాస్పదం కావడంతో అతని ఇంటికి భద్రత కల్పించిన సంగతి తెలిసిందే.

ఇంకో అప్ డేట్ విషయానికి వస్టే.. తమిళ స్టార్ విజయ్, పూజా హెగ్డే నటించిన మూవీ ‘బీస్ట్’లోని ‘అరబిక్ కుతు’ సాంగ్ యూట్యూబ్ రిక్డాలను తిరగరాస్తోంది. తాజాగా 150 మిలియన్ల వ్యూస్ మార్కును దాటింది. రిలీజైన 4 రోజుల్లో 50 మిలియన్లు, వారం రోజుల్లో 70 మిలియన్లు, 12 రోజుల్లో 100 మిలియన్లు, 23 రోజుల్లో 150 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలో అత్యంత వేగంగా ఇన్ని వ్యూస్ వచ్చిన సాంగ్ ఇదే.

మరో అప్ డేట్ ఏమిటంటే.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ‘నాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. కొందరు నాపై కావాలనే అబద్ధపు, అసత్యపు వార్తలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై నా స్టేట్‌మెంట్ కూడా తీసుకోలేదు. ఇది పూర్తిగా కల్పితం. ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర పన్నుతున్నాడని’ స్పష్టం చేసింది.