Rajamouli Suggest Changes To Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ ఇప్పటికే సినిమా సెన్సార్ కూడా పూర్తయ్యింది. అయితే దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ‘రాధే శ్యామ్’ ప్రత్యేక షోను వీక్షించి, పలు మార్పులను సూచించాడట. ఆల్రెడీ సెన్సార్ పూర్తి చేసుకున్న ఫైనల్ కాపీలో 10 నిమిషాల ట్రిమ్ చేసినట్టు సమాచారం. సినిమా విడుదల నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.

ఇక కొత్త జీవో కోసం టాలీవుడ్ చేసిన పోరాటం ఫలించింది. కానీ కొత్త జీవో ప్రకారం శుక్రవారం విడుదల కానున్న “రాధేశ్యామ్”కు తిప్పలు తప్పట్లేదు. ఎందుకంటే 100 కోట్లు దాటినా పెద్ద బడ్జెట్ సినిమాలు ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేదు. ఏపీలో 20శాతం షూటింగ్ చేసుకున్న హై బడ్జెట్ సినిమాలకు మాత్రమే 10రోజులు ధరలు పెంచుకునే అవకాశముంది.
Also Read: రాధేశ్యామ్ థియేటర్లో పూజా హెగ్డే చేసిన ఈ చిలిపి పని.. వైరల్ వీడియో
దీంతో ‘రాధేశ్యామ్’ టికెట్ కౌంటర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. మరోపక్క సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ సర్కార్ జీవో తెచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ పరిశ్రమ సమస్యలను పరిష్కరించినందుకు ప్రభాస్ సీఎం జగన్ కు థాంక్స్ కూడా చెప్పాడు. సినిమాల పునరుద్ధరణకు జగన్ నిర్ణయం సహాయపడుతుందని ఆశిస్తున్నాను అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

మరి ఇప్పుడు ప్రభాస్ ఏమి చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా ఏపీలో సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోలో కొన్ని లొసుగులు ఉన్నట్టు పలువురు సినీ వ్యక్తులు అంటున్నారు. అయినా ఈ కొత్త జీవో పెద్ద బడ్జెట్ సినిమాలకు ఎంతవరకు ఉపయోగమో చూడాలి.
Also Read: బొమ్మరిల్లు మూవీని వదులుకున్న హీరో ఇతనే.. చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడేమో..