40 Years For TDP: టీడీపీకి ఎంత ఘనమైన చరిత్ర ఉంది. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ మిగతా ప్రాంతీయ పార్టీలు అయిన టీఆర్ ఎస్, వైసీపీ కంటే సీనియర్. కానీ టీడీపీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. కాగా మరో మూడు రోజుల్లో టీడీపీ ఏర్పడి 40 ఏండ్లు పూర్తవుతాయి. ఇది పార్టీకి చాలా కీలకమైన రోజు. ప్రతి ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మహానాడుగా నిర్వహిసత్ఉన్నారు.
కానీ ఒకప్పటిలా ఈ మహానాడు కార్యక్రమం లేదంటున్నారు తమ్ముళ్లు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ హయాంలో మహానాడుకు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడును పొగిడే సరికే మహానాడు పరిమితం అవుతోంది తప్ప అంతకు మించిన వ్యూహాలను ప్రకటించడంలో మాత్రం ముందడుగు వేయట్లేదు.
Also Read: AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ఎప్పటికి పూర్తయ్యేనో?
గత కొన్నేండ్లుగా జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో కేవలం చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయడం వరకే సరిపోతోంది. అంతే గానీ పార్టీని క్షేత్ర స్థాయిలో బలపరిచే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను గానీ.. లేదంటే ఇతర కీలక కార్యక్రమాలను చేపట్టడంలో గానీ పార్టీ ముందడుగు వేయట్లేదు. దీనిపైనే టీడీపీ తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక బలమైన విధానాన్ని ఈ మహానాడు వేదికగా ప్రకటించాలంటూ చెబుతున్నారు. ఇప్పటి నుంచే రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలిచేవిధంగా బలమైన వ్యూహాన్ని ప్రకటించాలని, మరో ఇరవై ఏండ్ల దాకా పార్టీకి తిరుగులేని వ్యూహాలను రచించాలని కోరుతున్నారు. కానీ టీడీపీ అధినాయకత్వం మాత్రం ఆ మేరకు దృష్టి సారించట్లేదని తెలుస్తోంది.
పైగా పార్టీ కోసం కష్టపడుతున్న వారికి గుర్తింపు లభించట్లేదనే వాదన టీడీపీలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఎన్టీఆర్ హయాంలో సామాన్యుల నుంచే నాయకులను ఎన్నుకునే వారని, కానీ ఇప్పుడు మాత్రం అలా జరగట్లేదంటున్నారు. కాబట్టి ఈ 40వ వసంత వేడుకల సందర్భంగా చంద్రబాబు సామాన్యుల నుంచే పార్టీ నాయకులను ఎన్నుకునే విధంగా ప్రకటన చేయాలంటున్నారు. కానీ చంద్రబాబు అలాంటి కొత్త ప్రకటన ఏమైనా చేస్తారా లేదంటే మళ్లీ మూస ధోరణి పాటిస్తారా అన్నది చూడాలి.
Also Read: Radhe Shyam OTT Announcement: ఓటీటీలోకి ‘రాధేశ్యామ్’.. అధికారిక ప్రకటన వచ్చేసింది !
Recommended Video: