Jagan Suffered For Gautam Reddy: వైసీపీ మాజీ మంత్రి దివంగత నేత మేకపాటి గౌతం రెడ్డి సంస్మరణ సభను నెల్లూరులోని కనపర్తిపాడులో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ చాలా ఎమోషనల్ అయ్యారు. గౌతమ్ కుటుంబానికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గౌతమ్ లేని లోటును తీర్చలేమని, అది తన పార్టీకి, తనకు వ్యక్తిగతంగా పెద్ద నష్టమేనని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా గౌతమ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను కాంగ్రెస్ నుంచి 2009–10కాలంలో విడిపోయి బయటకు వచ్చినప్పుడు గౌతమ్ తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారని చెప్పారు. అయితే రాజమోహన్ రెడ్డి తాను పార్టీ కంటే ముందు తనకు మద్దతుగా రావడానికి కారణం గౌతమ్ అని ఎవరికీ తెలియని విషయాన్ని వెల్లడించారు.
గౌతమ్ తో తనకున్న అనుబంధమే ఆయన తండ్రిని తన పార్టీలో చేరేలా ప్రోత్సహించిందన్నారు. అలా తనకు మొదటి నుంచి గౌతమ్ అన్ని విధాలుగా అండగా ఉన్నాడని, తన వల్లే రాజకీయ అరంగేట్రం చేసినట్టు చెప్పారు. ఇక రాష్ట్ర అభివృద్ధిలో కీలకం అవుతాడని తాను మంత్రి పదవి ఇచ్చినట్టు వెల్లడించారు.
Also Read: AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ఎప్పటికి పూర్తయ్యేనో?
అయితే ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం అందరినీ కలిచివేసిందని చెప్పుకొచ్చారు. ఇక ఆయన జ్ఞాపకార్థం నెల్లూరు లోని సంగం బ్యారేజీకి ఆయన పేరు పెట్టామని, ఇక గౌతమ్ కలల ప్రాజెక్టు అయిన వెలిగొండ ను కూడా త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు. మెరిట్స్ కాలేజీని త్వరలోనే అగ్రికల్చర్ యూనివర్సిటీగా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు కూడా.
అయితే ఆయన ప్లేస్ లో ఆయన భార్యకు మంత్రి పదవి ఇస్తారనే ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. పైగా ఆమెను గౌతమ్ ప్లేస్‌లో పోటీ చేయిస్తే యునామినస్ గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని మొన్నటి వరకు వార్తలు వినిపించాయి. కానీ జగన్ మాత్రం వాటిపై స్పందించలేదు. రాజకీయ పరమైన హామీ ఏమైనా ఇస్తారేమో అని అంతా ఆశించినా.. అది జరగలేదు. మరి మంత్రుల మార్పు సమయంలో ఏమైనా హామీ ఇస్తారేమో చూడాలి.
Also Read: Somu Veeraju: పవన్ కళ్యాణ్ సీఎం.. 2024లో అధికారం.. ప్రత్యర్థులకు వ్యూహాలు చిక్కనివ్వని సోము వీర్రాజు