MLA Seethakka: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రెండు సినిమాలపై తీవ్ర చర్చ సాగుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ది కశ్మీర్ ఫైల్స్ తో పాటు ఆకాశమంత అంచనాలతో వచ్చి సంచలన విజయం సాధించిన ఆర్ ఆర్ ఆర్ ఒకటి. కాగా త్రిపుల్ ఆర్‌ను సినీ కోణంలోనే చూస్తే.. కశ్మీర్ ఫైల్స్‌ను మాత్రం రాజకీయాలకు ముడిపెట్టి చూస్తున్నారు.
ప్రధాని మోడీ దగ్గరి నుంచి బీజేపీ సీఎంల దాకా అందరూ కశ్మీర్ ఫైల్స్‌కు అండగా నిలుస్తున్నారు. అయితే త్రిపుల్ ఆర్ కూడా దేశ ఐకమత్యాన్ని చాటే మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ మూవీ స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలోనే తెరకెక్కడంతో.. దీనికి కూడా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తోంది. అయితే ఈ రెండు మూవీలను పోల్చుతూ కాంగ్రస్ ఎమ్మెల్యే సీతక్క చేసిన కామెంట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Also Read: Kejriwal Kodandaram: ఆప్ పార్టీలో టీజేఎస్ విలీనం..? కోదండరాంతో కేజ్రీవాల్‌కు ఒరిగేదేంటి..?
రీసెంట్ గా త్రిపుల్ ఆర్ మూవీని చూసిన సీతక్క.. తనదైన స్టైల్ లో కామెంట్స్ చేసింది. దేశ ఐకమత్యాన్ని పెంచాలంటే అందరూ ఆర్ ఆర్ ఆర్ మూవీ చూడాలని, అదే దేశాన్ని విభజించాలంటే కశ్మీర్ ఫైల్స్ ను చూడాలంటూ కామెంట్ చేసింది. దేశ వ్యాప్తంగా వివాదాస్పదం అవుతున్న కశ్మీర్ ఫైల్స్‌ను, త్రిపుల్ ఆర్ ను ఇలా పోల్చిన వారు ఎవ్వరూ లేరు.
సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ కామెంట్స్ చేసే సరికి తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి ఇలా కశ్మీర్ ఫైల్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడిందంటూ చెబుతున్నారు చాలామంది. వాస్తవానికి సీతక్కకు పార్టీలకు అతీతంగా మంచి పేరు ఉంది. ఆమె చేసే సేవా కార్యక్రమాలు ఆమెను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
కానీ పార్టీ భావజాలాన్ని ఆమె చూపించేయడం చాలామందికి కనెక్ట్ కాలేకపోతోంది. ఆమె చేసిన కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. చాలామంది ఆమెను సపోర్టు చేస్తుంటే.. కొందరు మాత్రం ఆమెను విభేదిస్తున్నారు.
Also Read: RGV Tweets On Rajamouli: రాజమౌళి.. నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం !