PM Modi Foreign Tours: విశ్వగురుగా కీర్తించబడుతున్న ప్రధాని మోదీ.. తన ఐదేళ్ల కాలంలో విదేశాలతో నెరుపుతున్న సత్సంబంధాలు, భారత దేశ ఖ్యాతిని విశ్వవ్యాపితం చేస్తున్నాయి. 75 ఏళ్ల స్వతంత్య్ర భారత దేశంలో ఏ ప్రధాని సాధించలేదని కీర్తిని విశ్వవ్యాప్తంగా మోదీ సంపాదించారు. దీనికి ఆయన ఆయా దేశాలతో నెరపుతున్న వాణిజ్య, రాజకీయ, సైనిక సంబంధాలతోపాటు ఆయా దేశాలకు అందిస్తున్న సహకారం మన కీర్తిని విశ్వవేదికపై చాలాదేశాలు కీర్తిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలుకుతున్నాయి.

ఫారిన్ టూర్‌కు భారీగా ఖర్చు..
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల కోసం ఐదేళ్ల కాలంలో రూ.239 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు రాజ్యసభలో కేంద్రమంత్రి మురళీధరన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాజ్యసభలో ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం, గడిచిన ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ మొత్తం 36 దేశాల్లో పర్యటించినట్లు పేర్కొన్నారు. దీనికోసం మొత్తం రూ.239 కోట్లకుపైగా ఖర్చు అయినట్టు పేర్కొన్నారు.
ఫిలిప్పీన్స్ నుంచి జపాన్ వరకు..
కేంద్ర మంత్రి మురళీధరన్ తన లిఖితపూర్వక సమాధానంలో మోదీ తొలి విదేశీ పర్యనట 2017, నవంబర్ 2017లో ఫిలిప్పీన్స్‌తో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఐదేళ్లలో ప్రతీ పర్యటనకు ఆయన లెక్కలను, వివరాలను వెల్లడించారు. మొత్తం ప్రధాని మోడీ చేసిన 36 పర్యటనలలో, తొమ్మిది పర్యటనలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో మోడీ పర్యటన సాగినట్లు తెలిపారు. అంతేకాదు 36 పర్యటనలలో ప్రధానమంత్రితోపాటు పర్యటనలలో పాల్గొన్న ప్రతినిధులు బృందాల వివరాలను వెల్లడించారు.
అమెరికా టూర్‌కు గరిష్టంగా..
మోదీ పర్యటనల ఖర్చులో గరిష్టం అమెరికా పర్యటనకే మొత్తం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. 31 పర్యటనలకు సంబంధించి బడ్జెట్ నుంచి ఖర్చు చేసినట్లుగా కేంద్రం వెల్లడించింది. 2017 లో మొదట ఫిలిప్పీన్స్‌లో, 2021లో బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇటలీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఇలా మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు చేసిన పర్యటనలకు రూ.239,04,08,625 ఖర్చు అయినట్టుగా కేంద్రమంత్రి మురళీధరన్ వివరించారు. వీటిలో అత్యధికంగా ప్రధాని నరేంద్ర మోదీ 2019, సెప్టెంబర్ 21 నుండి 28 వరకు అమెరికా పర్యటన కోసం రూ.23 కోట్ల 27 లక్షల 9 వేలు ఖర్చు అయినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి∙28 వరకు ఈ ఏడాది జపాన్ పర్యటనకు రూ. 23 లక్షల 86 వేల 536 రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు.

విదేశీ పర్యటన ఫలాలు ఇవీ..
మోదీ విదేశీ పర్యటనలు భారత దేశానికి ఎంతో లబ్ధి చేకూర్చాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. విదేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయని మురళీధరన్ వ్యాఖ్యానించారు. అత్యున్నత స్థాయిలో విదేశీ భాగస్వాముల మధ్య ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై భారతదేశ దృక్పథాలపై అవగాహనను పెంచడానికి మోదీ∙విదేశీ పర్యటనలు ఉపయోగపడ్డాయని తెలిపారు. ఇలాంటి పర్యటనలే జాతీయ ప్రయోజనాలు పొందటానికి సాధనమని, భారతదేశం తన విదేశాంగ విధానం లక్ష్యాలను, జాతీయ ప్రయోజనాలను పొందడం కోసం ఇటువంటి పర్యటనలే ఒక ముఖ్యమైన సాధనమని వివరించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సమయంలో కుదిరిన అవగాహన భారతదేశానికి భాగస్వామ్య దేశాలతో సంబంధాలు బలోపేతం కావడానికి ఉపయోగపడ్డాయని తెలిపారు. భారతదేశ దృక్కోణాన్ని ప్రపంచదేశాలకు తెలియజేసి అంతర్జాతీయ నేరాలు, ఉగ్రవాదం, సైబర్ భద్రత మొదలైన ప్రపంచ సమస్యలపై ప్రపంచ అజెండాను రూపొందించడానికి వీలు కల్పించాయని వెల్లడించారు.