https://oktelugu.com/

టోక్యో ఒలింపిక్స్: 32కిలోల బంగారం.. 11 వేల అథ్లెట్స్

క్రీడా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒలింపిక్ డే రానే వచ్చింది. గతేడాదే ఈ సంరభం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎన్నో ఒడిదొడిగులను అధిగమించి మొత్తంగా శుక్రవారం ప్రారంభానికి టోక్యో నగరం సిద్ధమైంది.206 దేశాలు, 11 వేల మంది అథ్లెట్స్ పాల్గొనే ఒలింపిక్ క్రీడోత్సవం కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అగ్రరాజ్యం అని లేదు.. శరణార్థి దేశం అని లేదు.. అంది లక్ష్యం ఒక్కటే.. పతకం సాధించడం.. ఇందుకోసం వివిధ దేశాల […]

Written By:
  • NARESH
  • , Updated On : July 23, 2021 / 12:00 PM IST
    Follow us on

    క్రీడా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒలింపిక్ డే రానే వచ్చింది. గతేడాదే ఈ సంరభం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎన్నో ఒడిదొడిగులను అధిగమించి మొత్తంగా శుక్రవారం ప్రారంభానికి టోక్యో నగరం సిద్ధమైంది.206 దేశాలు, 11 వేల మంది అథ్లెట్స్ పాల్గొనే ఒలింపిక్ క్రీడోత్సవం కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అగ్రరాజ్యం అని లేదు.. శరణార్థి దేశం అని లేదు.. అంది లక్ష్యం ఒక్కటే.. పతకం సాధించడం.. ఇందుకోసం వివిధ దేశాల నుంచి అథ్లెట్స్ ఇప్పటికే టోక్యో నగరానికి చేరుకున్నారు.

    కూబర్టీన్ కలల్లోంచి పుట్టి 125 ఏళ్లుగా సాగుతున్న ఒలింపిక్స్ క్రీడలు మళ్లీ వచ్చేశారు. 32వ ఒలింపిక్ క్రీడలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది జపాన్ దేశం. 15 రోజుల పాటు సాగే క్రీడా సమయంలో పాల్గొనేందకు ఆటగాళ్లు ఇప్పటికే కసరత్తులు చేసి సిద్ధంగా ఉన్నారు. తమ నెంబర్ రాగానే దూకుడుగా వ్యవహరించేందుకు రెడీ అయ్యారు.

    ఇక ఆరంభ వేడుకకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, మంగోలియన్ ప్రధాని ఓయున్-ఎర్డే, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడేన్ హాజరు కానున్నారు. భారత్ తరుపున హాకీ జట్టు సారధి మన్ ప్రీత్ సింగ్, బాక్సర్ మేరీ కోమ ఉన్నారు. టోక్యో నగరంలో సాగే ఈ క్రీడా పండుగలో 11 వేల మంది అథ్లెట్స్ పాల్గొననున్నారు. 33 క్రీడలు జరిగే ఇందులో 339 బంగారు పతకాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. ఇందులో భారత్ తరుపున 127 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

    206 దేశాల నుంచి పాల్గొనే వారికి టోక్యో అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ ఒలింపిక్స్ కోసం తొలిసారిగా రీసైక్లింగ్ చేసి పతకాలను వాడనున్నారు. అలాగే 32 కిలోల బంగారాన్ని వినియోగించారు. మొత్తంగా 556 గ్రాముల బంగారం, 550 గ్రాముల రజతం, 450 గ్రాముల కాంస్యం అందించనున్నారు. 2024 ఒలింపిక్స్ క్రీడలు ప్రాన్స్లో, 2028లో లాస్ ఏంజిల్స్, 2032లో ఆస్ట్రేలియాలో నిర్వహించాలని నిర్ణయించారు.