జోమాటో ఐపీవో: తొలిరోజే ఎగబడుతున్నారు..

ఫుడ్ డెలవరీలో సంచలనాలు సృష్టిస్తున్న జోమాటో పబ్లిక్ ఇష్యూకు అదిరిపోయేలా స్పందన వచ్చింది. జనాలు ఈ షేర్లు కొనేందుకు తపనపడ్డారు.దీంతో స్టాక్ ఎక్జ్సేంజీలో రికార్డు నమోదైంది. జోమాటో ఐపీవోకు మంచి స్పందన వచ్చింది. తొలిసారి పబ్లిక్ ఇష్యూకు వచ్చిన జోమాటో షేర్ల కోసం ఎగబడ్డారు. షేర్ ధర బీఎస్ఈలో రూ.115 వద్ద ప్రారంభమైంది. ఐపీవో ధర రూ.76తో పోలిస్తే 51.32శాతం ప్రీమియంతో నమోదైంది. అదే సమయంలో ఎన్ఎస్ఈలో 53శాతం ప్రీమియంతో రూ.116 వద్ద లిస్ట్ అయ్యింది. దీంతో […]

Written By: NARESH, Updated On : July 23, 2021 1:00 pm
Follow us on

ఫుడ్ డెలవరీలో సంచలనాలు సృష్టిస్తున్న జోమాటో పబ్లిక్ ఇష్యూకు అదిరిపోయేలా స్పందన వచ్చింది. జనాలు ఈ షేర్లు కొనేందుకు తపనపడ్డారు.దీంతో స్టాక్ ఎక్జ్సేంజీలో రికార్డు నమోదైంది.

జోమాటో ఐపీవోకు మంచి స్పందన వచ్చింది. తొలిసారి పబ్లిక్ ఇష్యూకు వచ్చిన జోమాటో షేర్ల కోసం ఎగబడ్డారు. షేర్ ధర బీఎస్ఈలో రూ.115 వద్ద ప్రారంభమైంది. ఐపీవో ధర రూ.76తో పోలిస్తే 51.32శాతం ప్రీమియంతో నమోదైంది. అదే సమయంలో ఎన్ఎస్ఈలో 53శాతం ప్రీమియంతో రూ.116 వద్ద లిస్ట్ అయ్యింది. దీంతో లిస్టింగ్ సమయంలో ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.90219 కోట్ల వద్ద నిలిచింది.

ఐపీవో ప్రారంభమైన వెంటనే బీఎస్ఈలో 42 లక్షల షేర్లు చేతులు మారడం విశేషం. ఎన్ఎస్ఈలో ఏకంగా 19.41 లక్షల షేర్లను కొనుగోలు చేశారు.

ఇక ఉదయం జోమాటో షేర్ బీఎస్ఈలో ఎగబాకింది. ఏకంగా 72శాతం పెరిగి 131 వద్ద ట్రేడ్ అవుతోంది. ఓ దశలో రూ.13 వరకు చేరడం విశేషం.

రూపాయి విలువ గల షేరును జోమాటో రూ.76 చొప్పున కేటాయించడం విశేషం. గత శుక్రవారంతో ముగిసిన జోమాటో ఐపీఓకు 40.38 రెట్ల స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు బిడ్స్ ద్వారా ఏకంగా రూ.2.13 లక్షల కోట్లు నిధులు సమకూరాయి. 11 ఏళ్ల మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యధికంగా పేర్కొన్నారు.