పాకిస్తాన్(Pakistan) లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. సాక్షాత్తు దేశ స్వాతంత్ర్యం రోజునే ఈ హృదయ విదాకర సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. మహిళ(Woman) అని చూడకుండా విచక్షణా రహితంగా వందలాది మంది దాడికి తెగబడటం దారుణం. మనుషుల్లా కాకుండా రాక్షసుల్లా ప్రవర్తించిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మనిషిలో కూడా రాక్షసులు ఉంటారని ఈ ఘటనతో అర్థమవుతుంది. సాటి మనిషిని అగాధంలోకి తోసేసి వికృత చేష్టలను అందరు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. పాకిస్తాన్ అంటే ఖబరస్తాన్ అని ఇప్పటికైనా అర్థం చేసుకోవచ్చు.
పాకిస్తాన్ లో మరో దారుణం జరిగింది. మహిళా టిక్ టాకర్ పై సుమారు 300 మంది దాడికి పాల్పడడం అత్యంత హేయమైన చర్య. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఓ టిక్ టాకర్ తన ఆరుగురు స్నేహితులతో కలిసి లాహోర్ లోని మినార్ -ఇ-పాకిస్తాన్ వద్ద టిక్ టాక్ వీడియో చిత్రీకరిచంచాలనుకున్నారు. అదే సమయంలో సుమారు మూడు వందల మంది ఆమెను చుట్టుముట్టి దాడికి తెగబడ్డారరు. ఆమెను గాల్లోకి ఎగరేస్తూ దుస్తులు చించడానికి ప్రయత్నించారు. దీంతో ఆమె బెంబేలెత్తింది. చుట్టు చేరిన వారిని తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ ఎంతకు సాధ్యం కాలేదు.
ఈ నేపథ్యంలో పరిస్థితి గమనించిన సెక్యూరిటీ గార్డు మినార్ -ఇ-పాకిస్తాన్ గేటు తెరవడంతో అక్కడి నుంచి తన స్నేహితులతో ఆమె బయటపడింది. బలవంతంగా ఆమె చేతికి ఉన్న ఉంగరం, చెవి రింగులు, తన స్నేహితుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ఐడీ కార్డు, రూ.15 వేలు లాక్కున్నారు. ఈ ఘటనపై టిక్ టాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్తాన్ లో రోజురోజుకు ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఒక మహిళ అని చూడకుండా అంత మంది చుట్టుముట్టి దారుణంగా దాడికి పాల్పడడంపై ప్రజల్లో ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి. అంత మంది ఒక్కసారిగా ఆమెపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నిస్తున్నారు. మహిళను గౌరవించాల్సింది పోయి ఆమెపై దాడికి తెగబడటం వెనుక ఏ ఉద్దేశం ఉందో తెలియడం లేదు. మొత్తానికి ఆమె తన రక్షణకు ఎంతగా పాకులాడిందో వీడియో చూస్తే అర్థమవుతుందని నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: 300 men in pakistan assault woman tiktoker on i day
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com