Ukraine Crisis: తప్పు ఎవరిది అయినా.. మధ్యలో బలైపోతున్నది మాత్రం పాపం ప్రజలే. నాటో, అమెరికా కూటమికి దగ్గరై తన పక్కలో బల్లెంలా తయారైన ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా.. ఎంతకూ లొంగిపోని ఆదేశంపైకి ఇప్పుడు క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడిలో అమాయక ప్రజలు చనిపోతున్నారు. రష్యా సేనలు భీకర దాడులతో విరుచుకుపడుతుండడంతో ఉక్రెయిన్ లో మరణ మృదంగం వినిపిస్తోంది.

కీవ్, ఖర్కివ్, మరియుపోల్ వంటి నగరాలపై రష్యా క్షిపణులు, బాంబు దాడులతో బెంబేలెత్తిస్తోంది. ఇన్నాళ్లు ప్రజలను ముట్టుకోకుండా సైన్యాన్ని, అక్కడి ప్రభుత్వంపై, కీలక స్థావరాలపైనే దాడి చేసిన రష్యా ఇప్పుడు రూటు మార్చింది. యూరప్, అమెరికా ప్రోత్సాహంతో రెచ్చిపోతున్న ఉక్రెయిన్ పై ముప్పేట దాడికి దిగుతోంది. ఎంతకూ లొంగని ఉక్రెయిన్ తీరుతో రష్యా పెద్ద ఎత్తున క్షిపణలు, బాంబులు సందిస్తోంది.
ఈ క్రమంలోనే మరియుపోల్ లోని ఓ థియేటర్ పై బాంబు వేసింది రష్యా. అందులో ఉన్న 300 మంది మరణానికి కారణమైంది. ఈ విషయం తెలిసి ప్రపంచమే నివ్వెరపోయింది. పౌరసమాజాన్ని ముట్టుకోనని అన్న రష్యా సేనలు ఇప్పుడు అక్కడి పౌరుల ప్రాణాలకే రక్షణ లేకుండా చేస్తున్న వైనం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
Also Read: Amit shah vs Prashant Kishor: అమిత్ షా, పీకే వ్యూహాలకు గుజరాత్ వేదిక కానుందా?
ఉక్రెయిన్ దేశానికి వ్యూహాత్మక ఓడరేవు ‘మరియుపోల్’. ఇక్కడ వందల మంది యుద్ధ భయానికి థియేటర్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రష్యా జరిపిన బాంబు దాడిలో ఈ థియేటర్ లోని 300 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. మరియుపోల్ లోని ఓ డ్రామా థియేటర్ పై దాడిలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయని తెలిపింది.
నెలరోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ ఎంతకూ లొంగకుండా మొండిగా పోరాడుతోంది. అమెరికా, నాటోదళాలు ఉక్రెయిన్ కు సహకరిస్తున్నాయి. ఈ యుద్ధ భయానికి లక్షలాది మంది ప్రజలు.. తాగునీరు, ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. చిన్నారులు, మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది చనిపోతున్న పరిస్థితి నెలకొంది.
ఇక ఈ యుద్ధంలో రష్యా కూడా సాధించింది ఏం లేదు. ఇప్పటివరకూ 16వేల వరకూ సైనికులను కోల్పోయింది. ఇక 561 యుద్ధ ట్యాంకులు, 1625 సాయుధ శకటాలు, 115 యుద్ధ విమానాలు, 125 హెలిక్యాపర్లు నాశనం అయ్యాయి.
Also Read: Nagendra Babu: అది న్యూసెన్స్ సైట్.. ఫేమస్ వెబ్ సైట్ మీద నాగబాబు ఆగ్రహం.. ఏమైందంటే..?
[…] Petrol Diesel Price Increase: అంతా భయపడుతున్నట్టే మళ్లీ పెట్రో మోత మోగుతోంది. మొన్నటి వరకు తటస్థంగా ఉన్న చమురు ధరలు ఒక్కసారిగా ధరల పిడుగును వేస్తున్నాయి. గత ఐదు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ మీద రూ.3.10 పెరిగింది. ఇటు తెలంగాణలోనూ ధరలు విపరీతంగా పెరుగతున్నాయి. ఇంకా కూడా పెరుగుతాయంట. […]
[…] AP Govt Has Massively Increased The Pole Tax: ఏపీలో జగన్ సర్కార్ మరో బాదుడుకు సిద్ధమైంది. విద్యుత్ స్తంభంపై కేబుల్ వైర్లు కడితే భారీగా పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.50, మండల కేంద్రాలు, పట్టణాల్లో రూ.75, జిల్లా కేంద్రాలు, నగరాల్లో అయితే రూ.100 వసూలు చేయనున్నారు. ఈ ఉత్తర్వులపై కేబుల్ ఆపరేటర్లు భగ్గుమంటున్నారు. సీఎం జగన్ విపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు పోల్ ట్యాక్స్ రద్దు చేస్తానని కేబుల్ ఆపరేటర్లకు హామీ ఇచ్చారు. అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తిస్తానని చెప్పుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి ఒక అధ్యయన కమిటీ వేస్తానని సైతం హామీ ఇచ్చారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా ఈ సమస్యలేవీ పరిష్కరించలేదు. ఇప్పడు ఏకంగా పోల్ ట్యాక్స్ ను భారీగా పెంచడంతో కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలతో గుంపగుత్తిగా ఓట్లు వేశామని.. ఇప్పుడు తమను మోసం చేశారని వాపోతున్నారు. దాదాపు నాలుగు రెట్లు ట్యాక్స్ పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే కేబుల్ నడపలేమని చెబుతున్నారు. […]