TDP Vs YCP: జగన్ వాయిస్ ఇమిటేట్ చేస్తే రూ.30 లక్షల ఆఫర్.. సంచలన వీడియో వైరల్

తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ విపరీతంగా ట్రోల్ అవుతోంది. జగన్ వాయిస్ ను ఇమిటేట్ చేస్తే.. రూ.30 లక్షలు ఆఫర్ చేసినట్లు ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

Written By: Dharma, Updated On : December 15, 2023 6:37 pm

TDP Vs YCP

Follow us on

TDP Vs YCP: ఏపీలో రాజకీయాలు దిగజారిపోతున్నాయి. బండ బూతులు తిట్టుకొని.. కుటుంబాలను సోషల్ మీడియాకు ఈడ్చుకుంటున్న రాజకీయ పార్టీలు.. ఫేక్ పోస్టులతో అదరగొడుతున్నాయి. ప్రత్యర్థులను బెదరగొడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఫేక్ వార్తలతో పోస్టులు పెట్టి విమర్శలు చేసేవారు. ఓ పార్టీ సానుభూతిపరుల పేరుతో ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేసి కులపరమైన పోస్టులు పెట్టి రెచ్చగొడుతున్నారు.ప్రభుత్వాలు, పార్టీల విధానాలు, మౌఖికమైన ఆదేశాలు అంటూ సైతం ఫేక్ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. దీంతో ఏది అసలు ప్రకటనో.. ఏది అబద్ధపు ప్రకటనో తెలియడం లేదు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ విపరీతంగా ట్రోల్ అవుతోంది. జగన్ వాయిస్ ను ఇమిటేట్ చేస్తే.. రూ.30 లక్షలు ఆఫర్ చేసినట్లు ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. వచ్చే జనవరి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అద్భుతాలు జరగబోతున్నాయని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోకు మీమ్స్ గా ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ తో ఇంటర్వ్యూ వీడియోను జతపరిచారు. మీకు జగన్ వాయిస్ ఇమిటేట్ చేయాలని టిడిపి నేతలు సంప్రదించారా.. అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడుగగా.. సదరు మిమిక్రీ ఆర్టిస్ట్ అవును అని సమాధానమిచ్చాడు.

అయితే రాజకీయాలు ఇంతలా దిగజారిపోయాయా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఇలా పోస్ట్ చేసిన వీడియోస్ సైతం ఫేక్ గా కనిపిస్తోంది. ఒకవేళ టిడిపి నేతలు సంప్రదించి ఉంటే మాత్రం అంతకంటే దిగజారుడు రాజకీయంమరొకటి ఉండదు. ఫేక్ వీడియోలను సృష్టిస్తూ వైసిపి ఈ తరహా ప్రచారానికి దిగితే మాత్రం అది ముమ్మాటికీ తప్పే. రాజకీయ పార్టీల్లోకి వ్యూహకర్తలు ప్రవేశించాక.. ఇటువంటి చర్యలకు దిగుతుండడం సర్వ సాధారణంగా మారింది.

ఇటీవల సోషల్ మీడియాలో జ్యోతిష్యులు సైతం ట్రెండింగ్ గా నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పలానా పార్టీ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు. అనుకూల ఫలితం వస్తే ఒకలా.. ప్రతికూల ఫలితం వస్తే మరోలా మాటలు మార్చుతున్నారు. అంతిమంగా ప్రజలే అమాయకులుగా మారుతున్నారు. చివరకు రాజకీయ పార్టీల గెలుపోటములను చిలక జోస్యం సైతం చెబుతుండడం విశేషం. దానిని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆనందం పొందుతుండడం మరో విశేషం. ఇప్పుడు ఏకంగా ప్రత్యర్థుల వాయిస్ను ఇమిటేట్ చేస్తే..మిమిక్రీ ఆర్టిస్టులకు భారీ మొత్తంలో ఇవ్వడానికి ముందుకు రావడం మాత్రం ఆశ్చర్యకరమే. అందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.