https://oktelugu.com/

రేపు పెళ్లి పీఠలెక్కనున్న హీరో నిఖిల్..!

హీరో నిఖిల్ పెళ్లికి ముహుర్తం ఖారారైంది. రేపు(మే 14) ఉదయం 6.31గంటలకు నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. గతకొంతకాలంగా నితిన్-పల్లవి వర్మ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో గోవాలో వీరిద్దరి ఎంగెజ్మెంట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించారు. అనంతరం దేశంలో లాక్డౌన్ కారణంగా వీరిద్దరు వివాహా వేడుకను వాయిదా వేసుకున్నారు. ఈనేపథ్యంలోనే తమ వివాహా వేడుకను మే 14కు వాయిదా వేసుకున్నారు. అయితే దేశంలో లాక్డౌన్ మే 17వరకు కొనసాగనుండటంతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 13, 2020 / 05:01 PM IST
    Follow us on

    హీరో నిఖిల్ పెళ్లికి ముహుర్తం ఖారారైంది. రేపు(మే 14) ఉదయం 6.31గంటలకు నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. గతకొంతకాలంగా నితిన్-పల్లవి వర్మ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో గోవాలో వీరిద్దరి ఎంగెజ్మెంట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించారు. అనంతరం దేశంలో లాక్డౌన్ కారణంగా వీరిద్దరు వివాహా వేడుకను వాయిదా వేసుకున్నారు. ఈనేపథ్యంలోనే తమ వివాహా వేడుకను మే 14కు వాయిదా వేసుకున్నారు. అయితే దేశంలో లాక్డౌన్ మే 17వరకు కొనసాగనుండటంతో సింపుల్ గా వివాహాన్ని చేసుకునేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    ఇటీవల టాలీవుడ్ బడా నిర్మాత లాక్డౌన్లో హడావుడిగా, సిక్రెట్ పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. గతకొంతకాలంగా దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలపై అనే కొట్టిపారేశారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ లాక్డౌన్లో హడావుడి పెళ్లి చేసుకున్నారు. ఆయన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో పెళ్లితోపాటు దిల్ రాజు కుమార్తె వివాహ శుభాకాంక్షలు సోషల్ మీడియాలో తెలియడంతో అందరికీ తెల్సిందే. దిల్ రాజులాగే నిఖిల్ కూడా కొద్దిమంది సన్నిహితులతో తుతూమంత్రంగా వివాహాన్ని చేసుకునేందుకు సిద్ధపడుతున్నాడు.

    తొలుత కరోనా ఎఫెక్ట్ ముగిశాక చేసుకుందా అనుకున్న నిఖిల్ కొద్దిరోజుల్లో మూఢం, మంచి రోజులు లేకపోవడంతో అర్జెంట్ గా పెళ్లి పీఠలెక్కందుకు రెడీ అవుతున్నారు. నగర శివార్లలోని ఓ ఫామ్ హవుస్ లో పెళ్లి జరగనుందని సమాచారం. లాక్డౌన్లో హడావుడి పెళ్లిళ్లపై నెటిజన్లు నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. ఏదిఏమైనా నిఖిల్ ఓ ఇంటివాడవుతుండటంపై అభిమానులు ఖుషీ అవుతున్నారు.