Fake Universities: దేశంలో నకిలీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. చివరకు అది విద్యావస్థకు కూడా తాకింది. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చాల్సిన విద్యాసంస్థలు కూడా కలుషితమవుతున్నాయి. విద్యాప్రమాణాలతో విద్యను అందించాల్సిన సంస్థలు కూడా నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఫేక్ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. వాటి బారిన పడుతున్న వేలాది మంది విద్యార్థులు బాధితులుగా మిగులుతున్నారు. ముఖ్యంగా నకిలీ యూనివర్సిటీలు దేశంలో విచ్చలవిడిగా పుట్టుకొస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తక్కువ వ్యవధి కోర్సులు అందించడంతో విద్యార్థులు ఆసక్తికనబరుస్తుంటారు. మరోవైపు ఉద్యోగాలు చేస్తున్నవారు తమ ఉద్యోగోన్నతి కోసం విద్యా ద్రువపత్రాలు అవసరమవుతుంటాయి. అటువంటి వారికి కూడా యూనివర్సటీలు ఆఫర్ చేస్తుండడంతో ఇట్టే వాటి బారిన పడుతున్నారు. దేశంలో ఏకంగా 22 ఫేక్ యూనివర్సటీలు ఉన్నట్టు నిర్థారణ అవడం ఆందోళన కలిగిస్తోంది. అందులో రెండు యూనివర్సిటీలు ఏపీలో ఉండడం విశేషం. అత్యధికంగా ఢిల్లీలో 8 యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ గుర్తించింది. వాటి పేర్లతో సహా ప్రకటించింది. ఈ యూనివర్సిటీల నుంచి పొందిన డిగ్రీలు చెల్లవని స్పష్టం చేసింది. దీంతో యూనివర్సిటీల్లో చదువుకొని పట్టాలు పొందిన వేలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

యూజీసీ చట్టాన్ని మీరి..
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ)కి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటని తుచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. యూనివర్సిటీల నిర్వహణ అంతా యూజీసీ పరిధిలోనే ఉంటాయి. కానీ యూజీసీ నియమ నిబంధనలు పాటించకుండా..యూజీసీ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 22 యూనివర్సీటీలను ఏర్పాటుచేశారు. వాటి ద్వారా విచ్చలవిడిగా డిగ్రీ, డిప్లమో, పీజీ పట్టాలు అందిస్తున్నట్టు యూజీసీ గుర్తించినట్టు కమిషన్ కార్యదర్శి రజనీస్ జైన్ తాజాగా వెల్లడించారు. ఆ 22 యూనివర్సిటీల్లో విద్యార్థలు చేరవద్దని విన్నవించారు. అక్కడ జారీ అయ్యే పట్టాలను దేశంలో ఎక్కడా పరిగణలోకి తీసుకోరని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఆ యూనివర్సిటీలు వేలాది మంది విద్యార్థులకు పట్టాలు జారీచేసినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. వారి పరిస్థితి ఏమిటన్నది ఎవరికీ తెలియడం లేదు. ఆ పట్టాలతో ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు. ఉద్యోగన్నతి దక్కించుకున్న వారు ఉన్నారు. ఇంకా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారూ ఉన్నారు. దీంతో వీరందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Also Read: Asia Cup 2022: నేటి నుంచి ఆసియా కప్.. తొలి మ్యాచ్ కు రంగం సిద్ధం.. రేపే పాక్-ఇండియా ఫైట్

ఏపీలో రెండు..
దేశ వ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలను యూజీసీ గుర్తించింది. ఏపీకి సంబంధించి విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఒకటికాగా.. మరొకటి గుంటూరులోని క్రైస్ట్ న్యూటెస్ట్ డిమ్ట్ యూనివర్సిటీ . ఇక డిల్లీలో అత్యధికంగా ఎనిమిది యూనివర్సిటీలు ఫేక్ గా తేలాయి. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ, కమర్షియల్ యూనివర్సిటీ, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఒకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్ సెంట్రిక్స్ జ్యుడీషియల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, విశ్వకర్మ యూనివర్సిటీ ఆఫ్ సేల్స్ ఎంప్లాయిమెంట్, ఆధ్యాత్మిక్ యూనివర్సిటీ నకిలీవిగా యూజీసీ తేల్చింది. ఒక ఉత్తర ప్రదేశ్ లో గాంధీ విద్యాపీఠ్ (అలహాబాద్), నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ యూనివర్సిటీ (కాన్పూరు), నేతాజీ సుభాష్ చంద్రబాబు ఓపెన్ యూనివర్సిటీ (అలీగడ్), భారతీయ శిక్ష పరిధ్ (లక్నో)యూనివర్సిటీలు ఫేక్ గా తేలింది. పశ్చిమబెంగాల్, ఒడిశా, కేరళ, పుదుచ్చేరిలో ఒక్కో యూనివర్సిటీ నకిలీగా తేలింది. దీంతో యూజీసీ వీటి విషయంలో కఠిన ఆంక్షలు విధించింది.
Also Read:Netizens vs Anasuya: ట్రెండింగ్ లోకి ఆంటీ.. అనసూయ కన్నీళ్లు.. అసలేం జరిగింది ?


[…] […]