Parliament Elections 2024 : ఓటు.. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ వజ్రాయుధంతోనే మనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ప్రతి ఐదేళ్లకోసారి ఓట్ల పండుగ వస్తుంది. ఈసారి కూడా పార్లమెంట్ ఓట్ల పండుగ వచ్చింది. ఏడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి దశ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. భారతదేశానికి దిగువ సభ అయిన లోక్ సభలోని 543 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. 969 మిలియన్ నమోదిత ఓటర్లు, 44 రోజులు, 5.5 మిలియన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు జరుగుతాయి. ఇలా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించి జూన్ 4న లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల్లో ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని నేషనల్ డెమోక్రటిక్ ఆలయన్స్, ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్ క్లూజివ్ ఆలయన్స్ ఉంది.. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు ఓటింగ్ నిర్వహిస్తారు.
తమిళనాడు: ఈ రాష్ట్రంలో మొత్తం 39 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
రాజస్థాన్: ఈ రాష్ట్రంలోని 25 సీట్లలో 12 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
ఉత్తరప్రదేశ్: 80 పార్లమెంటు స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో 8 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
మధ్యప్రదేశ్: 29 పార్లమెంటు స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
మహారాష్ట్ర: 48 పార్లమెంటు స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
ఉత్తరాఖండ్: ఈ రాష్ట్రంలో మొత్తం ఐదు పార్లమెంటు స్థానాలు ఉండగా.. వాటన్నింటికీ ఎన్నికలు నిర్వహిస్తారు.
అస్సాం: ఈ రాష్ట్రంలో మొత్తం 14 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
బీహార్: ఈ రాష్ట్రంలో 40 పార్లమెంటు స్థానాలు ఉండగా, నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
పశ్చిమబెంగాల్: ఈ రాష్ట్రంలో 42 పార్లమెంటు స్థానాలు ఉండగా, మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్: ఈ రాష్ట్రంలో రెండు పార్లమెంటు స్థానాలు మాత్రమే ఉండగా.. వాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
మేఘాలయ: ఈ రాష్ట్రంలోనూ రెండు పార్లమెంటు స్థానాలు మాత్రమే ఉన్నాయి. వాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
చత్తీస్ గడ్: ఈ రాష్ట్రంలో 11 పార్లమెంటు స్థానాలు ఉండగా.. ఒక్క స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
నాగాలాండ్: ఏకైక పార్లమెంటు స్థానం ఉన్న ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 19న ఎన్నికలు నిర్వహించనున్నారు.
సిక్కిం: ఈ రాష్ట్రానికి కూడా ఒకే ఒక పార్లమెంటు స్థానం ఉండడంతో.. దానికి ఏప్రిల్ 19న ఎన్నికలు నిర్వహించనున్నారు.
జమ్ము కాశ్మీర్: ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో, ఒక్క స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.
అండమాన్, నికోబార్ దీవులు: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఒకే ఒక్క పార్లమెంటు స్థానం ఉంది.. దానికి ఏప్రిల్ 19న ఎన్నికలు నిర్వహించనున్నారు.
పుదుచ్చేరి: ఇది కూడా కేంద్ర పాలిత ప్రాంతమే. దీనికి కూడా ఏప్రిల్ 19న ఎన్నికలు నిర్వహించనున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: 21 states 102 parliament seats these are the first phase of polling
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com