Sandeep Reddy Vanga : బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘కబీర్ సింగ్’ సినిమాను తీసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ..నిజానికి ఈ దర్శకుడు తెలుగు వాడే అయినప్పటికీ తను తీసిన మొదటి సినిమా అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా అక్కడ కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇక ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు 5 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఈ సినిమాలో నటించిన ఒక నటుడు ఇప్పుడు ఈ సినిమాలో తను చేసిన క్యారెక్టర్ మీద కొన్ని ఘాటైన కామెంట్లైతే చేశాడు. ఆ కామెంట్స్ ఏంటి? ఇంతకీ ఆ నటుడు ఎవరు? అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
షాహిద్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన కబీర్ సింగ్ సినిమాలో ‘కాలేజీ డీన్’ పాత్రలో ‘అదిల్ హుస్సేన్’ అనే ఒక సీనియర్ నటుడు నటించాడు. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను చేయను అని ఎంత చెప్పిన వినకుండా ఒక్కరోజు క్యారెక్టర్ ఉంది అని డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ నన్ను ఫోర్స్ చేయడం తో నేను ఈ సినిమాలో నటించాను. దానికి పెద్ద మొత్తంలో కూడా నాకు పారితోషికం చెల్లిస్తాము అని చెప్పి ఒప్పుకున్న పారితోషికం ఇచ్చారు. మొత్తానికైతే నన్ను ఒప్పించి నాతో ఆ ఒక్క రోజు క్యారెక్టర్ ని చేయించారు. ఇక ఈ సినిమా డీసెంట్ గా కాలేజీ లవ్ స్టొరీ లాగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ తీరా థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూస్తే అది ఇంకో రకంగా ఉంది.
ఇక అప్పుడు నేను ఈ సినిమాని ఎందుకు చేశానా అని చాలా బాధ పడ్డాను. ఎందుకంటే నా స్నేహితుడిని పక్కన కూర్చోబెట్టుకొని ఈ సినిమా నేను చూడలేను. అలాగే ఈ సినిమాలో చేశానని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది’.. అంటూ తను ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా పట్ల కొన్ని ఘాటు వ్యాఖ్యలైతే చేశాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న ‘సందీప్ వంగ’ ట్విట్టర్లో (ఎక్స్) వేదిక గా ఆ నటుడి మాటల పట్ల స్పందిస్తూ ‘ఈ సినిమాలో మీరు ఒక చిన్న పాత్ర చేయడం వల్ల మీకు 30 సినిమాలకు రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో వచ్చింది.
నటనపై అభిరుచి కంటే కూడా మీకు దురాశ ఎక్కువగా ఉంది. మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఇక మీరు ఏ సినిమా అయితే చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో ఆ సినిమాలో మీ క్యారెక్టర్ లేకుండా దాన్ని ఏ ఐ సహాయం తో మార్చేస్తాను’.అంటూ సందీప్ వంగ ఎక్స్ లో ఆ నటుడు చేసిన వ్యాఖ్యలకి గట్టి కౌంటర్ అయితే ఇచ్చాడు…ఇక వీళ్ళ మధ్య జరిగిన ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు సందీప్ వంగ ప్రభాస్ తో ‘స్పిరిట్ ‘ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు…