Home2020 రౌండ్ అప్2021 Roundup: 2021 రౌండప్.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామం

2021 Roundup: 2021 రౌండప్.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామం

2021 Roundup: ఈ ఏడాది తెలంగాణ రాజకీయాలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలా జరుగుతుందని ఆయా పార్టీ నేతలు కూడా అనుకుని ఉండరు. గులాబీ పార్టీకి మాత్రం అనుకోని ఎదురు దెబ్బలు తగిలాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నో డక్కాముక్కీలు తిన్నాయి. అయితే, ఈ ఏడాది కొందరికి రాజకీయంగా ప్రమోషన్ రాగా, మరికొందరికి డిమోషన్ వచ్చింది. తెలంగాణలో బీజేపీ భవిష్యత్ ఎంటి అనుకునే వారికి తమ బలం ఎంటో ఆ పార్టీ నేతలు గట్టిగానే చూపించారు. ఈ ఏడాది మొత్తం తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. కారణం వరుస ఎన్నికలు. ఒకదానివెనుక ఒకటి జరుగుతూనే ఉన్నాయి. దీంతో 2021లో పెద్దగా అభివృద్ధి జరగలేదని కాదనలేని వాస్తవం..

కాగా, ఈ ఏడాది రాజకీయంగా ఏయే పార్టీలు లబ్ది పొందాయి. ఏయే పార్టీలు జీరో పర్ఫామెన్స్ కనబరిచాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

2021 Roundup
Telangana 2021 Roundup

గులాబీకి ప్లస్ అండ్ మైనస్..

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత మొదలవుతోంది. దాని ఫలితమే దుబ్బాక, హుజురాబాద్ ఎన్నొకత ఫలితం అని చెప్పుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, హూజుర్ ‌నగర్ బైపోల్ మరియు మొన్న జరిగిన ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీ తన పట్టు నిలుపుకుంది. ఇకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజీపీ, టీఆర్ఎస్ పార్టీకి 50 : 50 ఫలితాలు వచ్చాయి. ఎంఐఎం పార్టీ సపోర్టు మరోసారి మేయం పీఠాన్ని టీఆర్ఎస్ కైవలం చేసుకుంది. కానీ బీజేపీ జీహెచ్ఎంసీలో 40కు పైగా స్థానాలు దక్కించుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా తన ప్రభావాన్ని కోల్పోయింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 99 స్థానాలు సాధిస్తే.. అందులో సగం స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఎంఐఎం ఎప్పటిలాగానే పాతబస్తీలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో తన పట్టును నిలుపుకుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఏడాది జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఫెయిల్ అవుతూనే వచ్చింది.

ప్రమోషన్, డిమోషన్..

2021 రాజకీయాల్లో పెనుమార్పులు కనిపించాయి. కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. సీనియర్లు అందరినీ కాదని టీడీపీ నుంచి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ అందలం ఎక్కిచ్చింది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కేడర్‌లో జోష్ పెరిగింది. రేవంత్ రెడ్డి కూడా హస్తం పార్టీ మూలాల్లోకి వెళ్లి రిపేర్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కీలక నేతలను కలుపుకుని పోతున్నారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అయితే ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అన్న ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఇదిలాఉండగా, ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఈ ఏడాది అంతగా కలసి రాలేదని చెప్పుకోవాలి. మంత్రి స్థానంలో ఉన్న ఆయన ఏకంగా అధికార పార్టీ నుంచి ఘోరంగా బహిష్కరించబడ్డారు. సొంత పార్టీ నేతలే ఆయన్ను టార్గెట్ చేశారు. ఆయనపై కేసులు పెట్టారు. అసైన్డ్ ల్యాండ్స్‌ను కబ్జా చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. తీరా తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హుజురాబాద్ ఎన్నికల్లో తెలిచి టీఆర్ఎస్‌కు సవాల్ విసిరారు.

Also Read: తెలంగాణ భూమి బంగారం.. వ్యాపారుల కష్టానికి దక్కిన గౌరవం

ఆ ఏడాదిలో పొలిటికల్‌ పరంగా ఎక్కువగా లబ్ది ఎవరు పొందారంటే అది బీజేపీ పార్టినే.. ఎందుకంటే బీజేపీకి అసెంబ్లీలో మరో రెండు సీట్లు పెరిగాయి. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు, హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల విజయంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పుంజుకుంది. దీంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని, అందుకోసం కావాల్సిన సహాకారం అందిస్తామని ప్రకటించారు. ఇక టీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నది. ఈ విషయం సీఎం కేసీఆర్‌కు హుజురాబాద్ ఎన్నికల ఫలితంతో స్పష్టంగా తెలిసివచ్చింది. ఈటలను మరోసారి అసెంబ్లీకి అడుగుపెట్టకుండా చేయాలని వేలకోట్లు ఖర్చుచేశారు. దళితబంధు పథకం తెచ్చినా టీఆర్ఎస్‌కు ఓటమి తప్పలేదంటే అర్థం చేసుకోవచ్చు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలకు తెరతీయకపోతే అప్పుడు కూడా టీఆర్ఎస్కు గంపగుత్తగా స్థానాలు వచ్చేవి కాదని రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఏమీ ఒరలేదని చెప్పవచ్చు. కానీ ఇన్నిరోజులు ఇన్ యాక్టివ్ గా ఉన్న కార్యకర్తలు రేవంత్ రాకతో యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది.

Also Read: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, జగన్‌కు ఎదురీత తప్పదా..?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version