Homeఎంటర్టైన్మెంట్Ramcharan - Sukumar Combination: సుక్కు- చెర్రీ కాంబోలో మరో సూపర్​హిట్​ సినిమా?

Ramcharan – Sukumar Combination: సుక్కు- చెర్రీ కాంబోలో మరో సూపర్​హిట్​ సినిమా?

Ramcharan – Sukumar Combination: మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​ కెరీర్​లో మైలురాయిగా నిలిచిన సినిమాల్లో రంగస్థలం కూడా ఒకటి. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1985 విలేజ్ బ్యాక్​డ్రాప్​తో రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్​చరణ్ తన కెరీర్​లో ఎప్పుడూ చేయని విభిన్న పాత్రలో చెవిటోడిగా ఇందులో కనిపించారు. దీంతోనే, రామ్​చరణ్​ మంచి నటుడిగా గుర్తింపు పొందారు.

Ramcharan - Sukumar Combination
Ramcharan – Sukumar Combination

Also Read: రాంచరణ్ తో అల్లు అర్జున్ ‘విలన్’?

ఇప్పుడు ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో మరోసారి బాక్సాఫీసును బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నారు చరణ్​. మరోవైపు సుకుమార్​ పుష్ప సినిమాతో హిట్ కొట్టి పార్ట్ 2 తెరకెక్కించే పనుల్లో పడ్డారు. అయితే, తాజా సమాచారం ప్రకారం చెర్రి- సుక్కూ కాంబోలో మరో సినిమా రానున్నట్లు సమాచారం.  ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా ప్రకటించారు. పుష్ప సినిమా ప్రమోషన్స్ లో సుకుమార్ తన తర్వాత సినిమా గురించి మాట్లాడుకూ.. బన్నీతో పుష్ప సీక్వెల్ ఉండనుందని తెలిపారు. అనంతరం విజయ్ దేవరకొండతో మరో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత రామ్​చరణ్​తోనూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నానని వివరించారు. ఇలా వరుస ప్రాజెక్టులను ప్రకటించి అందర్నీ షాక్​కు గురి చేశారు. ప్రస్తుతానికి రామ్​చరణ్ సినిమా చర్చ దశలో ఉందని వివరించాడు.

ప్రస్తుతం సుకుమార్​- బన్నీ కాంబోలో వచ్చిన సినిమా థియేటర్​లో సందడి చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఆర్​ఆర్​ఆర్​లో నటిస్తున్నాడు రామ్​చరణ్​. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:  “పుష్ప” రాజ్ కు బెస్ట్ విషెస్ చెప్పిన చిట్టిబాబు ” రామ్ చరణ్ “…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version