https://oktelugu.com/

ఈ రోజు 4 గంటలకు ప్యాకేజీ వివరాలు!

కరోనా వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రకటించిన  ఆర్థిక ప్యాకేజీపై సర్వత్రా  ఆసక్తినెలకొంది. ఈ మెగా ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌ వివరాలను ప్రకటించనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ భారత్‌ అంతర్జాతీయంగా పోటీ పడేలా ఉంటుందని ఇప్పటికే కేంద్ర మంత్రులు తెలిపారు. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు దేశాలు భారీ ప్యాకేజీలు ప్రకటించాయి. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 13, 2020 6:37 pm
    Follow us on

    కరోనా వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రకటించిన  ఆర్థిక ప్యాకేజీపై సర్వత్రా  ఆసక్తినెలకొంది. ఈ మెగా ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌ వివరాలను ప్రకటించనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆమె మీడియాతో మాట్లాడనున్నారు.

    రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ భారత్‌ అంతర్జాతీయంగా పోటీ పడేలా ఉంటుందని ఇప్పటికే కేంద్ర మంత్రులు తెలిపారు. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు దేశాలు భారీ ప్యాకేజీలు ప్రకటించాయి. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నిన్న ఇది భారత జీడీపీలో దాదాపు 10 శాతమని ప్రకటించారు.

    ప్యాకేజీ వివరాలన్నీ ఇపుడే ప్రకటిస్తారా లేదా విడతల వారీగా ఉపశమనాన్ని ప్రకటిస్తారా అనేది స్పష్టత లేదు. మొత్తం వివరాలను ఒకేసారి ప్రకటించకపోవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే మొత్తం ప్యాకేజీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తించే అవకాశం లేదనీ, ఇది బహుశా కొన్ని సంవత్సరాలు అంటే 2022  వరకు లేదా అంతకు మించి వ్యవధిలో వుంటుందని అంచనా.  ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొన్న భూమి, కార్మికులు, చట్టం లాంటి  అంశాల్లో   సంస్కరణ చర్యల ప్రభావం  దీర్ఘకాలికంగా దాదాపు  3-5  సంవత్సరాలు వుండొచ్చని పేర్కొంటున్నారు.