S 400 missile: భారత రక్షణ రంగం బలిష్టంగా మారుతోంది. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటూ శత్రుదేశాలకు సవాలు విసురుతోంది. దీంతో దాయాది దేశాలకు భంగపాటు తప్పదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో అటు పాకిస్తాన్ ఇటు చైనా కుయుక్తులు పన్నుతున్న తరుణంలో భారత్ తన అమ్ములపొదిలో అస్ర్తములు సిద్ధం చేసుకుంటోంది. శత్రు దేశాన్ని మట్టి కరిపించగల సాంకేతికతను పుణికిపుచ్చుకుంటూ వాటికి సవాలు చేస్తున్నాయి. దీంతో భారత రక్షణ వ్యవస్థ పటిష్టంగా మారడంతో శత్రుదేశాలు సైతం భయభ్రాంతులకు గురవుతున్నాయి.

భారత అమ్ములపొదిలో మరో అస్ర్తం వచ్చి చేరింది. రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసే ఎస్-400 లను మోహరిస్తోంది. దీంతో పాకిస్తాన్ కు హెచ్చరికలు సంపినట్లు అయింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఎస్-400 ట్రయాంప్ గగనతల రక్షణ వ్యవస్థను బలిష్టం చేసే పనిలో పడింది. మనకు చేటు తెచ్చే దేశాల నుంచి మరింత జాగ్రత్తగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే పంజాబ్ సెక్టార్ లో రష్యా సహకారంతో దిగుమతి చేసుకున్న ఎస్ -400 లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎస్-400 లు వైమానిక దాడులు తిప్పికొట్టేందుకు వినియోగిస్తారు. దీంతో ఇవి ఇప్పటివరకు రష్యా, చైనా, టర్రీలు మాత్రమే వినియోగిస్తున్నాయి. దీంతో భారత రక్షణ వ్యవస్థను ద్విగుణీకృతం చేసే ఉద్దేశంతోనే ఇండియా వీటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవ రహిత విమానాలను కూల్చే వ్యవస్థ దీని ప్రత్యేకం కావడం గమనార్హం.
Also Read: Yogi Adityanath: కోటి మంది ఓట్లు కొల్లగొట్టే యూపీ సీఎం యోగి ప్లాన్ ఇదీ
2007లో రష్యా దీన్ని సైన్యంలోకి ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఆకాశంలో సెకనుకు 2800 మీటర్ల వేగంతో వస్తున్న రెండు లక్ష్యాలను 16 కిలోమీటర్ల ఎత్తున ఇది ఛేదించనున్నట్లు చెబుతున్నారు. దీంతో భారత్ తన సైనిక బలాన్ని మరింత పెంచుకున్నట్లు అయింది. అత్యాధునిక ఆయుధాలతో ప్రత్యర్థి కదలికలను గుర్తించేందుకు ఉపయోగించే విధంగా ఎస్-400 ఉండటం దేశానికి అన్ని విధాలుగా మేలే చేకూరనున్నట్లు రక్షణ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Also Read: Modi vs TRS: టీఆర్ఎస్ ‘వరి’ కాటుకు.. మోడీ దెబ్బ మామూలుగా లేదుగా!