Heart Breaking story : ఆ యువతిది 19 సంవత్సరాల వయసు. ఆడుతూ పాడుతూ.. చదువుతూ సందడి చేయాల్సిన వయసు. టీనేజ్ లో ఆయువతికి ఎవరికీ రాని కష్టం వచ్చింది. తండ్రికి కాలేయం బాగా లేకపోవడంతో ఆస్పత్రులకు తిప్పాల్సిన దుస్థితి. ఆసుపత్రులలో తిప్పినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. కాలేయం మార్చడం తప్ప వేరే మార్గం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ యువతి చేసిన సాహసం.. చేసిన త్యాగం అంతా ఇంతా కాదు.. చివరికి తన ప్రాణాలను పణంగా పెట్టుకొని తండ్రి ప్రాణం కాపాడింది.
Also Read : అహ్మదాబాద్ విమానం ఎందుకు కూలిందంటే? కాక్ పిట్ లో మినట్ టు మినట్ జరిగింది ఇదీ
ఆ యువతి పేరు రాఖీ దత్త. వయసు 19 సంవత్సరాలు. ఆమె ఒక కళాశాలలో చదువుకుంటున్నది. అతడి తండ్రి కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రులలో చూపించగా కాలేయం దెబ్బతినదని వైద్యులు చెప్పారు. కాలేయం మార్చాలని సూచించారు. దాతలను వెతుక్కోండి అని చెప్పారు. తన తండ్రి దుస్థితి చూడలేక రాఖీ దత్తా తన కాలేయం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దానికి తగ్గట్టుగా వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత రాఖీ దత్త తన శరీరంలోని 65% కాలేయాన్ని తండ్రి కోసం దానం చేసింది. ఇందుకోసం క్లిష్టమైన ఆపరేషన్ కూడా భరించింది. తన ఛాతి కింది భాగంలో చేసిన ఆపరేషన్ ద్వారా కాలేయాన్ని తన తండ్రికి ఇచ్చింది. ఇందుకోసం ఎంతో నొప్పిని భరించింది. పక్కటెముకల ప్రాంతంలో తీవ్రమైన ఇబ్బందిని భరించింది. ఆమె కాలేయాన్ని 65% తీయడానికి వైద్యులు దాదాపు 15 గంటల పాటు ఆపరేషన్ చేశారు. అంతటి ఆపరేషన్ కూడా రాఖీ భరించింది.
రాఖీ శరీరం నుంచి తీసిన కాలేయాన్ని ఆమె తండ్రి శరీరంలో మార్పిడి చేశారు. అయితే కాలేయం మార్పిడి చేసినప్పటికీ రాఖీ తండ్రి కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే అతని ఆరోగ్యం అత్యంత సంక్లిష్టంగా ఉంది. అతడు శరీరంలో కాలేయం అమర్చినప్పటికీ.. అది విస్తరించడానికి సమయం పడుతుంది. జీవన క్రియలు జరపడానికి కూడా సమయం పడుతుంది. అప్పటిదాకా అతడు మందుల మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. పైగా కాలేయం మార్పిడి విషయంలో ఆయన సుదీర్ఘమైన శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కాలక్రమంలో అతడి శరీరంలో కాలేయం పునరుత్పత్తి మొదలుపెడుతుంది..
Also Read: తెలుగు వాళ్ళంటే అరుణాచలంలో అంత చులకనా? తెలంగాణ యువకుడి విషాదంతంతో కలకలం!
నేటి కాలంలో తల్లిదండ్రులను దూరం పెట్టి.. యువత వ్యక్తిగత స్వేచ్ఛను విపరీతంగా అనుభవిస్తున్నారు. ఇలాంటి కాలంలో తన తండ్రి కోసం ఏకంగా రాఖి తన ప్రాణాలను ఫణంగా పెట్టింది. ఏకంగా 15 గంటల పాటు ఆపరేషన్ ను ఎదుర్కొంది. చివరికి తన తండ్రి ప్రాణాన్ని నిలబెట్టుకుంది. తను కూడా కూతురిగా తన బాధ్యతను నిర్వర్తించింది. తల్లిదండ్రులను భారం అనుకొని.. ఇబ్బంది పెట్టి.. దూరం పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న నేటి తరానికి రాఖి ఎంతో ఆదర్శం. ఆపరేషన్ తర్వాత తన తండ్రితో రాఖీ ఫోటోలు దిగింది. తన తండ్రిని చూసి కన్నీరు పెట్టుకుంది. కూతురు తనకోసం చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ఆమె తండ్రి కూడా విలపించాడు.