Srisailam: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్తుండటంతో శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాపిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చూసేందుకు పర్యాటకులు భారీగా వెళ్తున్నారు. దీంతో అమ్రబాద్ మండలం పాతాళగంగ నుంచి దోమలపెంట చెక్ పోస్టువరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. జాతీయ రహదారిపై 10 కి.మీ మేర వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
శ్రీశైలం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్..
దోమలపెంట నుండి సున్నిపెంట వరకు నిలిచిపోయిన వాహనాలు
3 గంటలుగా రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
శ్రీశైలం గేట్లు ఎత్తడంతో డ్యామ్ చూసేందుకు భారీగా తరలి వస్తున్న పర్యాటకులు
శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో భారీగా వాహనాల రద్దీ pic.twitter.com/033xngNb5O
— BIG TV Breaking News (@bigtvtelugu) July 12, 2025