https://oktelugu.com/

ఆ ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో కరోనా ఉధృతి కొంత వరకూ తగ్గిందని భావిస్తున్న నేపధ్యంలో మళ్ళీ కోవిడ్ – 19 కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన కలిగిస్తుంది. సోమవారం సాయంత్రం నుండి నేటి ఉదయం 9 వరకు 34 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క గుంటూరులో అత్యధికంగా 109 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకూ కొత్తగా కరోనా పాజిటివ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 14, 2020 / 07:28 PM IST
    Follow us on


    రాష్ట్రంలో కరోనా ఉధృతి కొంత వరకూ తగ్గిందని భావిస్తున్న నేపధ్యంలో మళ్ళీ కోవిడ్ – 19 కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన కలిగిస్తుంది. సోమవారం సాయంత్రం నుండి నేటి ఉదయం 9 వరకు 34 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క గుంటూరులో అత్యధికంగా 109 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.

    రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకూ కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివాసం ఉన్న ప్రాంతాలను వివరిస్తూ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచింది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని ఇస్లాంపేట, మార్కాపురం, గుంటూరు నగర పరిధిలోని అరండల్ పేట, సంగడి గుంట, కుమ్మరి బజారు, ఆనంద్ పేట, సుజాతా నగర్, బుచ్చయ్య నగర్, జిల్లా పరిధిలోని దాచేపల్లి, పొన్నూరు, కొరిటపాడు, నరసరావుపేట, ఉరువకట్ట, పెడకన, కర్నూలు జిల్లా ఆత్మకూరు, కర్నూలు పరిధిలోని గనిగల్లు, బనగానపల్లి మండలంలోని హుసేనాపురం, చాగలమర్రి ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

    వీటితో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు, బద్వేలు సమీపంలోని మహబూబ్ నగర్, చిత్తూరు జిల్లా వడమాలపేట, శ్రీకాళహస్తి ప్రాంతాలతో పాటు మద్దూరు పరిధిలోని పాణ్యం గ్రామం, నంద్యాల అర్బన్, నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు, తడ మండలంలోని బీవీ పాలెం, నెల్లూరు పరిధిలోని నవాబు పేట, కోటమిట్ట, చంద్రబాబు నగర్, రంగనాయకుల పేట, పెద్ద బజారు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, కృష్ణా జిల్లా రాణిగారితోట, విజయవాడ పరిధిలోని మాచవరం, అనంతపురం జిల్లా హిందూపూర్ మండల పరిధిలోని గూలకుంటల్లోనూ కొత్త కేసులు వచ్చాయని, ఇక్కడి వారంతా తగు జాగ్రత్తల్లో ఉండాలని సూచించింది.

    మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి వందలాది యాత్రికులు ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుకు పెడుతున్నారు. దీంతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ప్రవేశిస్తున్న యాత్రికులకు గరికపాడు చెక్‌పోస్టు వద్ద వైద్యులు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా పాజిటివ్ కేసులను క్వారంటైన్‌ సెంటర్లకు పంపేందుకు, అలాగే నెగిటివ్ వచ్చిన వారిని హౌస్ క్వారంటైన్ సెంటర్లలో 14 రోజుల పాటు ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 16 బస్సుల్లో దాదాపు 664 మంది యాత్రికులు ఆంధ్రా బార్డర్‌కు రానున్నారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర , ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. నేడు, రేపు ఆంధ్రాలోకి 16 టూరిస్టు బస్సులు ప్రవేశించనున్నాయి.