వలస కూలీల ఆకలి కేకలు!

మల్కాజిగిరి లోని సఫీల్ గూడ లో జైన్ కనెస్ట్రక్షన్స్ వద్ద బీహార్, యూపీ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్‌ కు చెందిన సుమారు 500మంది ధర్నాకు దిగారు. తమను గత 15 రోజులుగా ఎవరు పట్టించుకోవడంలేదని, కనీసం తాగడానికి నీళ్లివ్వడం లేదని వారు వాపోతున్నారు. తమ కాంట్రాక్టర్లు గాని ప్రభుత్వం కానీ తమకు ఎటువంటి సహాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారంతా సఫీల్ గూడ రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని […]

Written By: Neelambaram, Updated On : April 14, 2020 7:30 pm
Follow us on

మల్కాజిగిరి లోని సఫీల్ గూడ లో జైన్ కనెస్ట్రక్షన్స్ వద్ద బీహార్, యూపీ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్‌ కు చెందిన సుమారు 500మంది ధర్నాకు దిగారు. తమను గత 15 రోజులుగా ఎవరు పట్టించుకోవడంలేదని, కనీసం తాగడానికి నీళ్లివ్వడం లేదని వారు వాపోతున్నారు. తమ కాంట్రాక్టర్లు గాని ప్రభుత్వం కానీ తమకు ఎటువంటి సహాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారంతా సఫీల్ గూడ రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని లేకపోతే తమ రాష్ట్రాలకు తరలించాలని వేడుకుంటున్నారు. తమకు ఎక్కడా సోషల్ డిస్టెన్స్ లేదని ఒక్కొక్క గదిలో 10 మందిని ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ బయట వలస కార్మికులు లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘించారు. తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోతామంటూ దాదాపు 1500 మంది వలస కార్మికులు రోడ్లపైకి వచ్చి, గుమిగూడి ఆందోళన నిర్వహించారు. సత్వరమే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలంటూ పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా కార్మికులు వినకపోవడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు. అసలే మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది.

మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉన్న వేళ, కార్మికులు ఇలా భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘించడం మంచిది కాదని నిపుణులు, ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ విషయంపై హోంమంత్రి మాట్లాడుతూ… వలస కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుని ఉందని, వారు తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని కోరుకుంటున్నారని తెలిపారు. తాము మాత్రం వారిని నిలవరించే తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఉన్నామని ఆయన ప్రకటించారు.