KA Paul: రేవంత్‌ను సీఎం చేయమని 16 మంది సెలబ్రెటీలు ఫోన్లు చేశారు.. లిస్ట్‌ బయటపెట్టిన కేఏ.పాల్‌!

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిని చేయాలని 16 మంది తనకు ఫోన్‌ చేశారని వెల్లడించారు. ఈమేరకు కాల్‌ లిస్ట్‌ బయటపెట్టారు. ఇందులో తెలుగు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

Written By: Raj Shekar, Updated On : November 7, 2023 4:16 pm

KA Paul

Follow us on

KA Paul: తెలంగాణలో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ, మరోవైపు ప్రచారం జోరుగా సాగుతున్నాయి. విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో కేఏ.పాల్‌ తెలంగాణ పొలిటికల్‌ స్క్రీన్‌పై మళ్లీ ప్రత్యక్షమయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించి హల్‌చల్‌ చేశారు. తాజాగా ఇప్పుడు మరోమారు తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్‌ అయ్యారు. రావడం రావడంతోనే ఓ బాంబు పేల్చారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని సీఎంను చేయాలని తనకు 16 మంది వీవీఐపీలు ఫోన్‌ చేశారని చెప్పారు. ఈమేరకు కాల్‌ లిస్ట్‌ కూడా బయటపెట్టి సంచలనం రేపారు.

రెడ్డికి.. రెడ్డిల మద్దతు..
తెలంగాణలో రేవంత్‌రెడ్డికి షర్మిల మద్దతు ఇస్తుందని తాను ముందే చెప్పానని కేఏ.పాల్‌ తెలిపారు. 75 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలకు రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, మళ్లీ రేవంత్‌రెడ్డికి షర్మిల, కోదండరామ్‌రెడ్డి మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో రెడ్డి మినహా మిగతా వారు సీఎంకు అర్హులు కారా అని ప్రశ్నించారు.

16 మంది లిస్ట్‌ బయటపెట్టి..
ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిని చేయాలని 16 మంది తనకు ఫోన్‌ చేశారని వెల్లడించారు. ఈమేరకు కాల్‌ లిస్ట్‌ బయటపెట్టారు. ఇందులో తెలుగు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో చాలా మంది ఖమ్మ కమ్యూనిటీకి చెందిన నాయకులు, అమెరికా సంస్థకు చెందిన అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు కూడా ఫోన్‌ చేశారని వెల్లడించారు. కేంద్రంతో తమకు మోదీ శత్రువు, ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్‌ తమకు శత్రువులని, తెలిపారని చెప్పారు. చంద్రబాబు ఫాలోవర్‌ అయిన రేవంత్‌ తెలంగాణ సీఎం కావడానికి సహకరించారని కోరినట్లు వెల్లడించారు.

లిస్ట్‌ సరే.. రికార్డు ఏదీ?
పొలిటికల్‌ జోకర్‌ అయిన కేఏ.పాల్‌ బయటపెట్టిన లిస్ట్‌ కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. అయితే పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో సంచలనాల కోసం పాల్‌ ఇలాంటివి చేయడం కామన్‌ అయింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ గద్దర్‌ను ప్రజాశాంతి పార్టీలో చేర్చుకున్నారు. మునుగోడు అభ్యర్థిగా ప్రకటించారు. కాగా, తనకు ఫోన్‌ చేసిన వారి నంబర్లు యటపెట్టిన కేఏ.పాల్‌ తనతో మాట్లాడిన మాటలను మాత్రం బయటపెట్టలేదు. ఇక్కడే అనుమానం మొదలైంది. అసలు ఆ ఫోన్లు ఎప్పుడు వచ్చాయి. వారు ఫోన్‌ చేసిన కారణం ఏంటి.. దానిని రేవంత్‌రెడ్డికి ఆపాదించి సంచలనం రేపాలని పాల్‌ ఓ ప్రయత్నం చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది. కొంతమంది అయితే.. బీఆర్‌ఎస్‌ నాయకులే పాల్‌లో ఇలాంటి చీఫ్‌ పాలిటిక్స్‌ చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.