Aata Sandeep: బిగ్ బాస్ షో కొందరికి లైఫ్ ఇస్తే.. మరికొందరికి ఉన్న లైఫ్ ను కూడా లాగేసుకుంటుంది. పాజిటివ్ టాక్ తో బయటకు వచ్చినవారి కెరీర్ కు ఢోకా లేదు. కానీ పాజిటివ్ టాక్ తో ఇంట్లోకి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు నెగటివ్ గా వస్తే మాత్రం వారి సంగతి అంతే అని చెప్పాలి. అయితే ఇదే బిగ్ బాస్ షోలోకి వెళ్లి ఊహించని రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించాడు ఆట సందీప్. ఈయన చాలా మందికి తెలియదు. కానీ బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో తన పేరు మారుమోగుతుంది. అయితే ఈయన రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందులో ఓం కార్ గురించి చేసిన కామెంట్లు మరింత వైరల్ అయ్యాయి. ఇంతకు సందీప్ ఏమన్నారు అనుకుంటున్నారా? అయితే చూసేయండి..
ఆట సందీప్ పుట్టింది కాకినాడ. పెరిగింది, చదువుకుంది కూడా కాకినాడలోనే అని వెల్లడించారు. ఇక తన తండ్రికి ఓ ఫర్నీచర్ షాప్ ఉండేదట. అమ్మ టీచర్ గా చేసేవారట. కానీ సడన్ గా గోడౌన్ కాలిపోపవడం వల్ల కాకినాడ నుంచి హైదరాబాద్ కు షిప్ట్ అయ్యారట సందీప్ ఫ్యామిలీ. సడన్ గా గోడౌన్ కాలిపోవడంతో చాలా డబ్బులు నష్టపోయారట. ఇక ఈ డాన్సర్ అన్నయ్య కూడా జాండిల్స్ వల్ల చనిపోయారట. ఇంట్లో ప్రస్తుతం సందీప్ ఒక్కరే. సడన్ గా హైదరాబాద్ కు వచ్చి చాలా కష్టాలు పడిందట వీరి కుటుంబం.
అయితే డాన్స్ మీద ఉన్న ఆసక్తితో డాన్స్ ఫీల్డ్ లోకి వచ్చాడట ఈ డాన్సర్. ఆ తర్వాత వచ్చిన ఆట షో వల్ల తన కెరీర్ మారిపోయిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆట షో విన్ అవడం ఒక అదృష్టం అని పేర్కొన్నారు. అయితే డాన్స్ మాస్టర్ కావాలంటే ఓ ఐదేళ్లు తప్పక కష్టపడాలి అన్నారు. ఇదిలా ఉంటే చాలా సినిమాల్లో గ్రూప్ డాన్సర్ గా చేశారట. కానీ ఆయనకు మాస్టర్ గా కరెక్ట్ బ్రేక్ పడలేదని అన్నారు. అయితే ఓంకార్ గురించి మాట్లాడుతూ..జీనియస్ సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వలేదట. ఈ ఛాన్స్ కోసం చాలా ఎదురుచూశారట. కానీ ఛాన్స్ రాకపోవడంతో చాలా బాధ పడ్డాను అని తెలిపారు. ఆ తర్వాత సొంతంగా ఎదగాలని అనుకున్నారట. ఇక రాజుగారిగదిలో అనే సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారని.. ఆ పాత్ర జూనియర్ ఆర్టిస్ట్ కంటే కూడా దారుణంగా ఉంటుందని వెల్లడించారు సందీప్.