మహానాడులో 14 తీర్మానాలు..!

తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు కార్యక్రమం కొద్దిసేపటి క్రితం ప్రారంభయయ్యింది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు సహా ముఖ్య నేతలు చాలా తక్కువ సంఖ్యలో పార్టీ కార్యాలయం నుంచి మహానాడులో పాల్గొటుండగా మిగిలిన వారంతా వారి వారి ప్రాంతాల నుంచి జూమ్ యాప్ లో లాగిన్ అయ్యి మహానాడులో పాల్గొననున్నారు. టీడీపీ ఏర్పడిన అనంతరం ఈ విధంగా మహానాడు నిర్వహించుకోవడం ఇదే తొలిసారి. […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 4:19 pm
Follow us on


తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు కార్యక్రమం కొద్దిసేపటి క్రితం ప్రారంభయయ్యింది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు సహా ముఖ్య నేతలు చాలా తక్కువ సంఖ్యలో పార్టీ కార్యాలయం నుంచి మహానాడులో పాల్గొటుండగా మిగిలిన వారంతా వారి వారి ప్రాంతాల నుంచి జూమ్ యాప్ లో లాగిన్ అయ్యి మహానాడులో పాల్గొననున్నారు. టీడీపీ ఏర్పడిన అనంతరం ఈ విధంగా మహానాడు నిర్వహించుకోవడం ఇదే తొలిసారి. నేడు, రేపు రెండు రోజుల పాటు ఈ మహానాడు జరగనుంది.

ఈ ఏడాది మహానాడుకు ఒక ప్రత్యేక ఉందని అధినేత చంద్రబాబు తెలిపారు. మొత్తం 14 వేల మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొబోతున్నారని, 14 రాజకీయ తీర్మానాలు ఈ సమావేశాల్లో చేయనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తున్నదనే తన విశ్వాసమని, డిజిటల్ మహానాడు ఇటువంటి దేనని చెప్పారు. మహానాడులో రెండు రోజుల్లో చర్చించాల్సిన అంశాలపై ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం చర్చలు ప్రారంభమయ్యాయి. పలువురు నాయకులు వారికి కేటాయించిన అంశాలపై ప్రసంగిస్తున్నారు.