https://oktelugu.com/

కరోనాపై వాస్తవాలు దాస్తున్న కెసిఆర్ ప్రభుత్వం

లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ తెలంగాణలో వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఏమీ లేదని ఒక వంక సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే, అదే రోజు బుధవారం నాడు ఒకే రోజు రాష్ట్రంలో కరోనా కేసులు 108 పెరగడం, మరో ఆరుగురు మృతి చెందడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,000 ను దాటి 2,099కు చేరుకున్నాయి. తెలంగాణలో ఒకేరోజు ఇన్ని కేసులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 28, 2020 2:04 pm
    Follow us on


    లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ తెలంగాణలో వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఏమీ లేదని ఒక వంక సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే, అదే రోజు బుధవారం నాడు ఒకే రోజు రాష్ట్రంలో కరోనా కేసులు 108 పెరగడం, మరో ఆరుగురు మృతి చెందడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి.

    దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,000 ను దాటి 2,099కు చేరుకున్నాయి. తెలంగాణలో ఒకేరోజు ఇన్ని కేసులు ఇంతవరకు నమోదు కాకపోవడం గమనార్హం. అట్లాగే మృతుల సంఖ్య 69కి పెరిగింది. కాగా, బుధవారం చనిపోయినవారిలో ఏడు రోజుల చిన్నారి, నాలుగు నెలల బాబు ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

    పరిస్థితులు ఈ విధంగా ఉంటె ఆర్ టి సి కి ఆదాయం రావడం లేదని అంటూ రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనల నుండి సడలింపు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇక రాత్రి వేళల కూడా బస్సులు తిరగవచ్చు. బస్సుల నుండి దిగినవారు హైదరాబాద్ నగరంలో ఇళ్లకు వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు.

    మరోవంక, కరోనా లెక్కలు వెల్లడించడంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం రాత్రి పది గంటల తర్వాత విడుదల చేసిన బులెటిన్‌లో మొత్తం కేసుల సంఖ్య ఎంతన్నది స్పష్టంగా పేర్కొనలేదు. సాయంత్రం ఐదు గంటల నాటికి రాష్ట్రంలో ఇన్‌ఫెక్ట్ అయినవారి సంఖ్య 1,842 అని.. ఇందులో 39 కొత్త కేసులని పేర్కొన్నారు.

    ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 297 మందికి పాజిటివ్‌ వచ్చిందని.. అందులో 68 కొత్త కేసులని పేర్కొన్నారు. దీంతో కొత్త కేసుల సంఖ్య 108 అవుతుండగా.. మొత్తం కేసుల సంఖ్య 2,139 వస్తోంది. అయితే రాష్ట్రంలో మంగళవారం నాటి బులెటిన్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,991గా ఉంది. దానికి బుధవారం నాటి 108 కేసులు కలిపితే 2,099 అవుతోంది.

    అంటే మిగతా కేసులు ఏవి అన్నది గందరగోళంగా మారింది. బులెటిన్లో లెక్కలు తప్పుగా వచ్చాయని, మొత్తం కేసుల సంఖ్య 2,099గా పరిగణించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మెసేజ్ ఇచ్చారు. అయితే ఏ కేసుల లెక్కలో మార్పు చేయాలన్న వివరాలు వెల్లడించలేదు.

    ఇక హెల్త్ డిపార్ట్మెంట్ రోజూ బులిటెన్లో ఏయే జిల్లాల్లో ఎన్ని కేసులు వచ్చాయన్న వివరాలు ఇచ్చేది. కానీ బుధవారం జిల్లాల వారీగా లెక్కలు, గ్రేటర్ హైదరాబాద్ లెక్కలు ఇవ్వలేదు. మృతులు ఎవరు, ఏ జిల్లా వారన్నది కూడా వెల్లడించలేదు.