భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. మరణాలు

దేశంలో కరోనా మృతుల సంఖ్య ఆదివారం 27కు చేరింది. ఆరు రాష్ట్రాల్లో కరోనా రోగులు కొందరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య పెరిగింది. ఇక కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా 1024గా నమోదైంది. ఈ వివరాలను ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్నాటకల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్‌కు బలి అయ్యారని ఉదయం పది గంటల అధికారిక గణాంకాలలో వెల్లడైంది.ఇక కోవిడ్ వైరస్ సోకిన […]

Written By: Neelambaram, Updated On : March 30, 2020 10:59 am
Follow us on

దేశంలో కరోనా మృతుల సంఖ్య ఆదివారం 27కు చేరింది. ఆరు రాష్ట్రాల్లో కరోనా రోగులు కొందరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య పెరిగింది. ఇక కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా 1024గా నమోదైంది. ఈ వివరాలను ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్నాటకల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్‌కు బలి అయ్యారని ఉదయం పది గంటల అధికారిక గణాంకాలలో వెల్లడైంది.ఇక కోవిడ్ వైరస్ సోకిన వారి సంఖ్య వేయికి చేరువ కావడం ఆందోళనకర పరిణామంగా మారింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సాగుతూ వస్తున్నా మరణాలు, కొత్తగా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు.

కరోనా సోకిన వారిలో 867 మందిని తీవ్రస్థాయి కేటగిరిలో చేర్చారు. కరోనా వచ్చిన వారిలో 86 మందికి నయం అయింది. వారిని డిశ్చార్జ్ చేశారు.ఒక వ్యక్తి పారిపొయ్యాడు.ఇ ప్పుడు తాజాగా నమోదైన మొత్తం 1024 కరోనా కేసులలో 48 మంది విదేశీయులు ఉన్నారు. కేసులలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ కేసుల సంఖ్య 186గా నమోదైంది. వీరిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు.

కేరళలో 182 మందికి కరోనా వచ్చింది. వీరిలో ఎనమండుగురు విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో మృతుల సంఖ్య 6కు చేరింది. తరువాతి క్రమంలో గుజరాత్‌లో 4, కర్నాటకలో 3, మధ్యప్రదేశ్‌లో 2, ఢిల్లీలో 2, తెలంగాణ, కేరళ, తమిళనాడు, బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్‌లలో ఒక్కరు చొప్పున మరణించారు. కర్నాటకలో కరోనా సోకిన వారి సంఖ్య 76కు చేరింది.

తెలంగాణలో 66 (వీరిలో పది మంది విదేశీయులు), రాజస్థాన్‌లో 54 (వీరిలో ఇద్దరు విదేశీయులు), ఉత్తరప్రదేశ్‌లో 55 (ఓ విదేశీయుడు), గుజరాత్‌లో 53 (ఓ విదేశీయుడు), తమిళనాడులో 42 (ఆరుగురు విదేశీయులు) ఢిల్లీలో 39 మంది (వీరిలో ఓ విదేశీయుడు), పంజాబ్‌లో 38 , హర్యానాలో 33 (14 మంది విదేశీయులు), మధ్యప్రదేశ్‌లో 30, జమ్మూ కశ్మీర్‌లో 31, పశ్చిమబెంగాల్‌లో 17, ఆంధ్రప్రదేశ్‌లో 14, లడఖ్‌లో 13 మందికి కరోనా సోకిందని అధికారిక వివరాలలో తెలిపారు.

బీహార్‌లో తొమ్మండుగురికి, చండీగఢ్‌లో ఎనమండుగురికి, ఛత్తీస్‌గఢ్‌లో ఆరుగురికి, ఉత్తరాఖండ్‌లో ఆరుగురికి (వీరిలో ఓ విదేశీయుడు), హిమాచల్‌ప్రదేశ్‌లో, ఒడిషాలలో ముగ్గురు చొప్పున కరోనాకు గురయ్యారు. అండమాన్ నికోబార్ దీవులలో తొమ్మిది కేసులు, గోవాలో మూడు కేసులు నమోదు అయ్యాయి. పుదుచ్చేరి, మిజోరం, మణిపూర్‌లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులు అయ్యారు.

మెరికాలో కరోనా మృతుల సంఖ్య 2,300 దాటింది. ప్రపంచంలోనే అత్యధికంగా 1,33,000 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య మూడు రోజుల్లోనే రెట్టింపైంది. మొత్తం మరణాల్లో పావు భాగం న్యూయార్క్‌ నగరంలోనే సంభవించాయి. ఇటలీ పరిస్థితులే న్యూయార్క్‌లోనూ ఎదురుకావొచ్చని అక్కడి వైద్య నిపుణులు భయాందోళనలు వ్యక్తంచేశారు.

యూరప్‌లో కరోనా మృతుల సంఖ్య 20,000 దాటింది. ఇందులో సగం మరణాలు ఇటలీలోనే (10,779) చోటుచేసుకున్నాయి. ఇటలీ తర్వాత అత్యధికంగా ప్రభావితమైన స్పెయిన్‌లో ఆదివారం ఒక్కరోజే 838 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 6,606కి పెరిగింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను స్పెయిన్‌ మరింత కఠినతరం చేసింది. ఫ్రాన్స్‌లో 2,600 మందికిపైగా మరణించారు. బ్రిటన్‌లో మృతుల సంఖ్య 1200 దాటింది.

కరోనా కోరల్లో చిక్కి యూరప్‌, అమెరికా విలవిల్లాడుతున్నాయి. ఇటలీ, స్పెయిన్‌లలో ఒకే రోజు 800 మందికిపైగా చొప్పున మృత్యువాతపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 33,000 దాటింది. 7 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు మూడింట ఒక వంతు జనా భా దిగ్బంధంలో ఉన్నది. అమెరికాలో కరోనా వ్యాప్తికి కేంద్ర స్థానంగా ఉన్న న్యూయార్క్‌ నగరాన్ని దిగ్బంధించాలని ప్రతిపాదించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు.