Jammu And Kashmir Tourism: జమ్ము కాశ్మీర్ లో మార్పు మొదలైంది. శాంతియుత జీవనానికి అలవాటు పడుతున్నారు. మతసామరస్యం వెల్లివిరుస్తంది. ఇదంతా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలతో జమ్ము కాశ్మీర్ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ప్రజల్లో మంచి జీవనం కోసం ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దుతో ఎన్నో అనుమానాలను పటాపంచలు చేసింది. దీంతో ప్రజల్లో ఐకమత్యం కనిపిస్తోంది. పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. కాశ్మీర్ లో పర్యాటక రంగం ప్రగతి మార్గంలో పయనిస్తోంది. సరస్సులు, నదులు, పర్వతాలు అన్ని ప్రజల సందడితో కళకళలాడుతున్నాయి.

స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు 1.62 కోట్ల మంది పర్యాటకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సుందర ప్రదేశాలను ఆస్వాదిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి ఆదాయం పెరుగుతోంది. అభివృద్ధి అమాంతం రెట్టింపవుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ర్టం ముందు ముందు ఎంతో దూరం వెళ్లనుంది. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు అక్కడ సత్ఫలితాలు ఇస్తున్నాయి. కాశ్మీర్ అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులతో ఆదాయం సముపార్జిస్తోంది.
మోడీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు అక్కడ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. పర్యాటక రంగం పరవళ్లు తొక్కుతోంది. ఆదాయం ఇనుమడిస్తోంది. ప్రభుత్వానికి ఎంతో లబ్ధి చేకూరుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఇమేజ్ తో అక్కడ పరిస్థితులను చక్కదిద్దారు. 370 ఆర్టికల్ రద్దు చేసి అందరిలో శభాష్ అనిపించుకున్నారు. అక్కడ పర్యాటక రంగం నూతన పోకడలు పోతోంది. జమ్ము కాశ్మీర్ కు మంచి భవిష్యత్ రానుంది. ఈ నేపథ్యంలో ఎంతో మంది పర్యాటకులకు స్వర్గధామంగా మారుతోంది.

ఇంకా రాబోయే రోజుల్లో కాశ్మీర్ లో పర్యాటక రంగం ఇంకా పైకి పోయే సూచనలున్నాయి. అందమైన ప్రాంతం కావడంతో ఎంతో మంది కాశ్మీర్ ను సందర్శించేందుకు మొగ్గు చూపుతున్నారు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతోంది. రికార్డు స్థాయిలో డబ్బు రావడంతో రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జమ్ము కాశ్మీర్ ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచించి మరీ సరస్సులను ఎంతో అందంగా తీర్చిదిద్దింది. వంతెనలు కట్టి ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా చేస్తున్నారు. దీంతో పర్యాటక రంగం ఎంతో ముందుకు పోతోంది.
Also Read: Vande Bharat Express: వందే భారత్ ఇంజన్లలో ఎందుకీ నాణ్యతా లోపం?